1088 కేసులు.. భారీగా తగ్గిన కేసులు.. 9 మంది మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,088 కరోనా కేసులు వచ్చాయి. వైరస్ సోకిన 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 6,17,776కి చేరుకోగా, కరోనా వైరస్‌తో 3,607 మంది మరణించారు. రాష్ట్రంలో 16,030 యాక్టివ్ కేసులు ఉండగా, 5,98,139 మంది రికవరీ అయ్యారు.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం.

అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది. ఏపీలో ఒక కేసు వెలుగుచూసింది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా కేసులు వచ్చాయి. 7 రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. థర్డ్ వేవ్ ముప్పు అని ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో.. డెల్టా వేరియంట్ భయాందోళనను కలిగిస్తోంది.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications