తెలంగాణ కరోనా అప్‌డేట్స్: 1175 కేసులు.. 10 మంది మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ చల్లబడింది. తెలంగాణలో వైరస్‌కు చెక్ పెట్టడానికి సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. గత 24 గంటల్లో 1,24,907 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,175 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులు గుర్తించారు.
అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 1,771 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,586కి పెరిగింది. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,15,574 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,95,348 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,640 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనా కేసుల రికవరీ రేటు ప్రస్తుతం 96.71 శాతంగా ఉంది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది.
ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications