హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మల్టీప్లెక్స్‌లో వేగంగా కదిలిన ఎస్కలేటర్.. ‘గాంధీ’ మూవీకి వెళ్లిన విద్యార్థులకు గాయాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంజారాహిల్స్ ఆర్కే సినీ మ్యాక్స్‌లో ఎస్కలేటర్ ప్రమాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా చూసేందుకు వెళ్లిన భారతీయ విద్యాభవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు ఎస్కలేటర్‌పై ఉన్నప్పుడు ఒక్కసారిగా వేగంగా కదలడంతో కిందపడిపోయారు. దీంతో వారికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరిస్థితి సమీక్షించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేనను ఆదేశించారు.

12 students injured after slipping on moving escalator in Banjara Hills, Hyderabad

తాజా ఘటనను దృష్టిలో ఉంచుకుని గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో విద్యార్థుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు గాంధీ సినిమాను ఉచిత ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది.
గురువారం ఉదయం 9.50 గంటలకు భారతీయ విద్యాభవన్‌కు చెందిన 12 మంది విద్యార్థులు గాయాలతో ఆస్పత్రిలో చేరారని, బాధితుల్లో ఒక టీచర్ కూడా ఉన్నారని తెలిపింది. వారందరికీ చికిత్స అందించామని, పరిస్థితి మెరుగయ్యాక 13 మందిలో 9 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. మరో నలుగురిని అబ్జర్వేషన్లో ఉంచినట్లు, వారి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

English summary
12 students injured after slipping on moving escalator in Banjara Hills, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X