హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వల్పంగా పెరుగుతున్న కేసులు.. తెలంగాణలో 126.. హైదరాబాద్‌లో ఎక్కువే..

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పుడు అయితే స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 13,015 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 126 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 75 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 27, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8 కేసులు గుర్తించారు. 49 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

తెలంగాణలో ఇప్పటివరకు 7,94,584 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,89,357 మంది కోలుకున్నారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు. ఇదీ ఫోర్త్ వేవ్.. థర్డ్ వేవ్ అంతగా ఇంఫెక్ట్ చూపించలేదు. సెకండ్ వేవ్ మాత్రం అల్లాడించింది. చాలా మంది చనిపోయారు. ఫస్ట్ వేవ్ సమయంలో అంతా జాగ్రత్తలు తీసుకోవడంతో విస్తరణ అంతగా లేదు. మరీ ఇప్పుడు ఫోర్త్ వేవ్ ఎలా ఉంటుందో చూడాలీ.

126 corona cases are register in telangana state

ఇప్పటికే దాదాపు అంతా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. మరికొందరు మూడో డోస్ కూడా తీసుకున్నారు. దీంతో వైరస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో సింహాభాగం రాజధాని హైదరాబాద్‌లోనే వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్నీ ఆఫీసులు తెరచుకున్నాయి. రోడ్లపై జనాలు ఎప్పటిలా ఉన్నారు. కేసులు పెరగడానికి ఇదీ కూడా ఓ కారణం అయి ఉంటుంది.

వైద్యశాఖ అధికారులు సూచించిన విధంగా విధిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదివరకు వాడినట్టు బయటకు వెళ్లి వస్తే.. శానిటైజ్ చేసుకోవడం మరవొద్దు. పరిశుభ్రంగా ఉంటూ.. వైరస్‌ను సమూలంగా పారద్రోలాల్సిన అవసరం ఎంతయిన ఉంది.

English summary
corona cases are hike in the telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X