క్రమంగా తగ్గుముఖం.. నిన్నటి కన్నా తక్కువగా కేసులు, తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. వాతావరణం కాస్త చల్లబడటంతో వైరస్ కూడా మిన్నకుండిపోతోంది. గత కొద్దీరోజులుగా వస్తోన్న కేసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనాతో మరో 15 మంది పోరాడి ఓడిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు వచ్చాయి. ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.
మరోవైపు ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందుకు నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ కొరత ఉంది. కానీ దానిని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications