హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 రోజులు వాన.. ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత, బయట తిరగొద్దు

|
Google Oneindia TeluguNews

ఈ సారి వేసవిలో ఎండ వేడిమి ఎక్కువగానే ఉంది. ఉక్కపోత కూడా సేమ్ టు సేమ్.. దీంతో జనాలకు ఉదయం 9 దాటితే రావడం లేదు. ఇంపార్టెంట్ పని ఉంటేనే కాలు కదుపుతున్నారు. ఇటు రెండు, మూడురోజుల నుంచి ఉండ తీవ్రత ఏర్పడటం లేదు. ఆకాశం మట్టుబట్టి ఉంది. అలా ఉన్నా తిరగొద్దు అని నిపుణులు సజెస్ట్ చేశారు. ఉక్కపోతతో అల్లాడుతోన్న ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందజేసింది.

విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్లు ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అందువల్లే రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్ధితులు నెలకొని ఉన్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతుంటే, మరికొన్ని ప్రాంతాలలో వానలు కురిసి వాతావరణం చల్ల బడుతోంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

2 days rain in the telangana state hyderabad weather officials said

ఆదివారం హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లా చాప్రాలా లో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఈ స్ధాయిలో ఉష్ణోగ్రత నమోదవటం ఈ నెలలో ఇదే మొదటిసారి. వర్షాలు పడే సమయంలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కానీ జనం మాత్రం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

వేడిమి తగ్గేవరకు ఆగాలని నిపుణులు సూచిస్తున్నారు. చల్లగా ఉందని బయట తిరగొద్దు అని సూచించింది. రెండు, మూడు రోజులు తేలికపాటి జల్లులు కురిసిన లాభం లేదు. ఎందుకంటే భూమి మరింత వేడెక్కనుంది. వర్షకాలం సీజన్‌లో మాత్రమే.. ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. అప్పుడే భూమి చల్లబడి.. వాతావరణం కూడా కూల్‌గా ఉంటుంది.

English summary
2 days rain in the telangana state hyderabad weather officials said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X