తెలంగాణలో కరోనా కలకలం.. 2 వేలు దాటిన యాక్టివ్ కేసులు

కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కాస్త తగ్గుముఖం పట్టినా.. తెలంగాణలో మాత్రం మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి కరోనా కొత్త కేసుల సంఖ్య రెండు వందలు దాటింది. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2 వేల 26 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 19వేల 715 శాంపిల్స్ పరీక్షించగా, 236 మందికి పాజిటివ్ వచ్చింది.

హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 180 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 28, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో మరో 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో 7 లక్షల 96 వేల 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7 లక్షల 89 వేల 918 మంది కోలుకున్నారు. కరోనా వల్ల రాష్ట్రంలో ఇవాళ్టి వరకు 4బవేల 111 మంది మరణించారు.

 236 infected coronavirus at telangana

ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. ఈ నెల 16న 285 కొవిడ్ కేసులు, 17న 279 కేసులు, 18న 247 కేసులు వచ్చాయి. క్రితం రోజు రాష్ట్రంలో 27వేల 841 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 279 మందికి పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+