గుడ్‌న్యూస్: 50 వేల ఉద్యోగాల భర్తీ, అసెంబ్లీలో హరీశ్ రావు
ఆర్థికమంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఉద్యోగాలపై ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బిల్లు, మాజీ ప్రజాప్రతినిధుల పెన్షన్ పెంపు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. కనీస పెన్షన్ రూ. 50 వేలు కాగా, గరిష్ట పెన్షన్ రూ.70 వేలకు పెంచుతూ సభ ఆమోదం తెలిపింది.
ఒకటి, రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేల గతంలో పెన్షన్ రూ.30వేలు కాగా దాన్ని రూ.50 వేలకు పెంచారు. మూడు సార్లు అంతకుమించి గెలిచిన సభ్యుల పెన్షన్‌ను రూ. 50 వేల నుంచి 70 వేలకు పెంచారు. పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు బిల్లును కూడా సభ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీశ్ రావు వివరించారు.

దీనికి సంబంధించి అందరితో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇది అడ్డంకి కాబోదని చెప్పారు. రాష్ట్రంలో వెంటనే 50 వేల ఖాళీలు భర్తీ చేసేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications