Gold: సాక్సుల్లో 800 గ్రాముల బంగారం.. ఎలా దొరికిపోయాడంటే..!
అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. విదేశాల నుంచి భారత్ కు బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు ఏదో రూపంలో స్వర్ణాన్ని దేశాలు దాటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి చొక్కాలో బంగారం పెట్టుకుని వచ్చి అధికారులకు దొరికిపోయాడు. గత సోమవారం ఆర్‌జీఐ శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి 800 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ గౌస్ ఖాన్ అనే వ్యక్తి షర్ట్ లో 804 గ్రాముల బంగారం దాచి కుట్టేయించాడు. అదే షర్ట్ ధరించి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం దిగాడు. అధికారులు అతన్ని చూసి అనిమానించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు.

చొక్కాలో బంగారం
షర్ట్ కొంచె డిఫరెంట్ గా కనిపించడంతో షర్ట్ ను కత్తెరతో కట్ చేశారు. దీంతో అందులోని బంగారం బయటపడింది.విమానం దిగిన తర్వాత తనిఖీలు చేసినా నిందితుడి వద్ద ఏమీ దొరకలేదని అధికారులు తెలిపారు. కానీ అతను అనుమానాస్పందంగా కనిపించినట్లు వివరించారు. తాజాగా ఓ వ్యక్తి సాక్సుల్లో బంగారం దాచుకుని విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీలు చేశారు.

రూ.46లక్షల 53 వేలు
అతని వద్ద బంగారం దొరకలేదు. అయితే అతని షూ విప్పమని అడగ్గా కాస్త ఆలస్యం చేయడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సాక్సులను చెక్ చేయగా అతన వద్ద పుత్తడి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని నుంచి 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 46లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

కొంత మొత్తం
విదేశాల నుంచి భారత్ కొంత మొత్తం వరకే బంగారం తీసుకురావొచ్చు. భారీ మొత్తంలో బంగారం తీసుకురావాలంటే ట్యాక్స్ కట్టి తీసుకురావాల్సి ఉంటుంది. దుబాయ్ వంటి విదేశీ మార్కెట్ల నుంచి వ్యక్తిగతంగా చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ట్యాక్స్ పరిశీలన లేకుండా బంగారాన్ని తీసుకొచ్చే అనుమతి ఉంటుంది. బంగారం లేదా నగల రూపంలో మాత్రమే ఈ బంగారం లేదా వెండిని కొనుగోలు చేయాల్సి ఉంటుందట. నగల రూపంలో మినహా ఇతర ఏవిధమైన రూపాల్లోనూ బంగారం లేదా వెండిని భారత్‌లోకి దిగుమతి చేయడానికి అనుమతి లేదు.

20 గ్రాముల బంగారం
విదేశాల్లో ఒక ఏడాదిపైగా నివాసమున్న భారతీయ పురుష ప్రయాణికుడు రూ.50 వేలు విలువ చేసే 20 గ్రాముల బంగారం మాత్రమే ఎలాంటి పన్నులు లేకుండా భారత్‌లోకి తీసుకురావొచ్చు. అయితే మహిళా ప్రయాణికురాలు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు అంటే 40 గ్రాముల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అనుమతి ఉందని నిపుణులు వివరిస్తున్నారు.

ధర తక్కువ
చాలా మందికి విదేశాల్లో బంగారం స్వచ్ఛత ఎక్కువగా ఉంటుందని అపోహ ఉంది. దీంతో పాటు ఇతర దేశాల్లో పుత్తడి ధర ఉండడం కూడా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో భారీ మొత్తం బంగారాన్ని రవాణా చేస్తూ పోలీసులకు దొరికి పోతున్నారు.












Click it and Unblock the Notifications