New Year: హైదరాబాద్‏లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి..

హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడకలు ఘనంగా జరుపుకున్నారు. డిసెంబర్31 రాత్రి నుంచి జనవరి 1 వరకు కొందరు ఇంట్లో, కొందరు పబ్బుల్లో ఎంజాయ్ చేశారు. ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. తాగి వాహనాలు నడపొద్దని కోరారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు సీజ్ చేసినట్లు వివరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 517 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 A lot of cases of drunk and driving have been reported in Hyderabad

తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరించినా కొందరు తాగి వాహనాలను నడిపారు. కేసు నమోదు చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తామని చెప్పినా.. జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పినా తాగి వాహనాలు నడపడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆదివారం రాత్రి పలు ఫ్లై ఓవర్లను కూడా మూసివేశారు. బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేశారు.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేశారు. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లైఓవర్‌పై వెళ్లేవారు విమానం టికెట్‌ చూపిస్తే ఎయిర్ పోర్టుకు అనుమతి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+