Hyderabad: అందోళన కలిగిస్తోన్న గుండెపోట్లు.. షటిల్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి..

గత కొద్ది రోజులుగా గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెలు ఆ గిపోతున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. గత ఏప్రిల్ లో మహబూబాబాద్ జిల్లాలో 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించాడు.

కొద్ది రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని గురుకుల స్కూల్ లో ఓ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. అంతకు ముందు ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ ఓ వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి పెళ్లి హల్దీ ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఓ వ్యక్తి తన మేనకోడలి పెళ్లి డ్యాన్స్ చేస్తూ వేదికపైన కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు.

Hyderabad

మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా గంగధర మండలంలోని ఓ ఊరిలో విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్లో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మంగళవారం ఉదయం షటిల్ ఆడుతున్న 46 ఏళ్ల కృష్ణా రెడ్డి సడన్ గా కిందపడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే కృష్ణా రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చాలా మంది గుండెపోట్లకు బలవుతున్నారు.

కొద్ది రోజుల క్రితం 16 వేల మందికి గుండె ఆపరేషన్లు చేసిన డాక్టర్ గౌరవ్ గాంధీ కూడా గుండెపోటుతో మృతి చెందడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో గుండెపోటు అంటే లావుగా ఉండేవారికి, వయస్సు ఎక్కువగా ఉండేవారికి వచ్చేది. కానీ ప్రస్తుత జీవనవిధానాలతో వయస్సు సంబంధం లేకుండా గుండె పోట్లు వస్తున్నట్లు వైద్యలు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్తగా ఏమైన ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+