మరోసారి హైదరాబాద్‌లో కుంగిన రోడ్డు: గుంతలోకి టిప్పర్, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వెళుతున్న మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్.. కుంగిన గుంతలో కురుకుపోయింది.
హైదరాబాద్: నగరంలో మరోసారి రోడ్డు కుంగిపోయింది. గతంలో గోషామహల్ చక్నవాడిలో రోడ్డు కుంగిపోగా.. తాజాగా హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 5లో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వెళుతున్న మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్.. కుంగిన గుంతలో కురుకుపోయింది. దీంతో డ్రైవర్ తోపాటు ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా, కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవిహిస్తోంది. ఈ క్రమంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని.. అధికారులతో కలిసి టిప్పర్ తొలగించేందుకు చర్యలు చేపట్టారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కార్పొరేటర్ మహాలక్ష్మీ ఆరోపించారు. రెండేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్పొరేటర్ మహాలక్ష్మీ మండిపడ్డారు. ప్రమాదాన్ని ముందే గుర్తించి నాలుగు రోజుల ముందు అధికారులను అప్రమత్తం చేసినా నిర్లక్ష్యం చూపారని స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Another incident in #Hyderabad within a month...
— Surya Reddy (@jsuryareddy) January 28, 2023
A busy road #Cavedin at street No.5 in #Himayathnagar, it is the centre of the city. A loaded auto trolley got stuck in the deep hole in the middle of the road.
Check this @GHMCOnline . pic.twitter.com/ZTermgGMbI












Click it and Unblock the Notifications