హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో రజినీకాంత్... పార్టీ ప్రకటన తర్వాత కబాలి ఎందుకొచ్చారో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: తమిళం సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాదుకు వచ్చారు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తర్వాత హైదరాబాదు పర్యటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రజినీకాంత్ ఎలాంటి రాజకీయపరమైన అంశాలు చర్చించేందుకు హైదరాబాదుకు చేరుకోలేదని తాను నటిస్తున్న సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాదుకు వచ్చారని సమాచారం.

Recommended Video

ఎయిర్ పోర్ట్ లో రజినీకాంత్ .. ఫోటోలు వైరల్
హైదరాబాదులో రజినీకాంత్

హైదరాబాదులో రజినీకాంత్

చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన కబాలి.. తన తదుపరి చిత్రం అన్నాథే షూటింగ్‌లో పాల్గొంటారు. 2019లో అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ విశ్వంకు దర్శకత్వం వహించిన సిరుతై శివకు అన్నాథ చిత్రంను డైరెక్ట్ చేసే ఛాన్స్ రజినీకాంత్ ఇచ్చారు. ఇక అన్నాథేలో కీర్తి సురేష్, నయనతారా మీనా, ఖుష్బూ వంటి స్టార్‌ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక అన్నాథ నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ ఈ చిత్రం షూటింగ్ 15న ప్రారంభం అవుతుందంటూ తన అధికారిక ట్విటర్‌ పేజ్‌పై పోస్టు చేసింది. ఇదిలా ఉంటే రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు శివ ఒక వీడియో పోస్టును విడుదల చేశారు. అభిమానుల మద్దతు, వారి అభినందనల మధ్య తిరిగి అన్నాథ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశాడు.

త్వరగా సినిమాలు పూర్తి చేయాలని

త్వరగా సినిమాలు పూర్తి చేయాలని


ఇక హైదరాబాదులో షూటింగ్ మొదలు పెట్టి త్వరతగతిన పూర్తి చేసి సినిమా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. రజినీకాంత్ రాజకీయ పార్టీని పెడుతున్న నేపథ్యంలో తన సినిమాలను త్వరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్నాథ చిత్రం మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించి సినిమాకు ప్యాకప్ చెప్పేయాలని ఇటు దర్శకుడు అటు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రతి రోజు షూటింగ్ చేసి ఒక నెల రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు.దేశంలో లాక్‌డౌన్ విధించకముందే అన్నాథే చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

 వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు

ఇక తలైవా త్వరలోనే ప్రజాశీర్వాదం కోరనున్నారు. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పార్టీ పెడితే సింగిల్‌గా బరిలోకి దిగాలని వేరే ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే తమకు నచ్చదని రజినీ అభిమాన సంఘాలు తెలపడంతో తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని రజినీ కాంత్ స్పష్టం చేశారు. ఇప్పటికే తమిళనాట మరో యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టి వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు జయలలిత పార్టీ అన్నాడీఎంకే, కరుణానిధి పార్టీ డీఎంకేలు ఉండగా తాజాగా కమల్ హాసన్, రజినీ కాంత్ పార్టీలు ఏమేరకు ప్రభావం చూపుతాయో వేచిచూడాలి.

English summary
Superstar Rajani Kanth is in Hyderabad for his next film shoot Annaatthe.After announcing his plan on political party he is on a firm stance to complete his film shootings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X