హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హమ్మయ్యా.. ఓవైసీకి రిలీఫ్.. రెండు కేసులు కొట్టివేసిన నాంపల్లి కోర్టు

|
Google Oneindia TeluguNews

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీకి నాంప‌ల్లి కోర్టులో రిలీఫ్ కలిగింది. రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. నిజామాబాద్, నిర్మ‌ల్‌ మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. దీంతో అప్పట్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను నాంప‌ల్లిలోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు కొట్టివేసింది. ఓవైసీ విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేసిన‌ట్లు ఆధారాలు చూప‌లేద‌ని కోర్టు పేర్కొంది. రెండు కేసుల‌ను కొట్టివేస్తున్న‌ట్లు కోర్టు వెల్లడించింది.

విద్వేషపూరిత ప్రసంగం..?

విద్వేషపూరిత ప్రసంగం..?

నిజామాబాద్‌, నిర్మల్‌లో 2012 డిసెంబర్‌లో అక్బరుద్దీన్‌ పర్యటించారు. ఆ సమయంలో మతపరమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కేసు న‌మోదైంది. విచారణ చేపట్టిన కోర్టు అనేక మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం తుది తీర్పు వెల్ల‌డించింది. నాంపల్లి ధర్మాసనం ఓవైసీకి సూచనలు చేసింది. కేసు కొట్టివేయగానే విజయం అని భావించకూడదని నాంపల్లి కోర్టు సూచించింది. భవిష్యత్తులో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కోరింది.

దేశ సమగ్రతకు మంచిది కాదు

దేశ సమగ్రతకు మంచిది కాదు


అలాంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది. 2012 డిసెంబర్‌లో నిర్మల్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల బహిరంగ సభలో అక్బరుద్దీన్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అప్పట్లో ఓవైసీపై నిర్మల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. జనవరి 8న ఓవైసీని పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌తో అక్బరుద్దీన్‌ను నిర్మల్‌కు తరలించారు. జనవరి 9న ఆయనను నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు. ఆపై నిర్మల్ జైలుకు తరలించారు. ఫిబ్రవరి 14వ తేదీన అక్బరుద్దీన్ ఓవైసీకి నిజామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన నిర్మల్ జైలు నుంచి అక్బరుద్దీన్ విడుదల అయ్యారు.

9 ఏళ్ల విచారణ తర్వాత..

9 ఏళ్ల విచారణ తర్వాత..


ఈ కేసు విచారణ కొనసాగింది. 9 ఏళ్ల విచారణ తర్వాత ఏప్రిల్ 13వ తేదీన నాంపల్లి కోర్టు ఓవైసీపై నమోదైన కేసును కొట్టివేసింది. ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పు వెల్లడిస్తూనే.. జాగ్రత్తగా ఉండాలని ఓవైసీకి కోర్టు సూచించింది. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టంచేసింది. జాగ్రత్తగా మెలగాలని కోరింది. కోర్టు సూచనతో అయినా అక్బరుద్దీన్ తీరు మారుతుందో లేదో చూడాలీ మరీ.

English summary
mim mla akbaruddin owaisi relief to two cases in nampally court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X