మరో స్టార్ హీరోతో నాగార్జున మల్టీస్టారర్?
మన్మథుడు అక్కినేని నాగార్జున తన కొత్త సినిమాను ప్రకటించబోతున్నారు. అది సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ మూవీ కావడమే విశేషం. సాధారణంగా నాగార్జున మల్టీ స్టారర్ అనగానే నాగ చైతన్యతోనా? లేదంటే అఖిల్ తోనా? అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ వారిద్దరితో కాకుండా తమిళ స్టార్ హీరో ధనుష్ తో కొత్త సినిమా చేయబోతున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తన తరువాత సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. సినిమాను ప్రకటించి చాలాకాలం అయినప్పటికీ ధనుష్ బిజీగా ఉండటంతో వాయిదా పడుతూ వచ్చింది. దీన్ని యాక్షన్ థ్రిల్లర్ లా తీయాలనుకున్నారు.

కానీ కథ పూర్తయ్యేసరికి అది మల్టీస్టారర్ మూవీలా మారిపోయింది. కథలో హీరో పాత్రతోపాటు మరో పాత్ర కూడా చాలా కీలకమైంది. దీంతో స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేద్దామనుకుంటున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జునను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కింగ్ కు కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు సమాచారం.
నాగ్ కు వేరే హీరోలతో పలుమార్లు స్క్రీన్ పంచుకున్నారు. ఊపిరి సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో నటించారు. ఇప్పుడు ధనుష్ తో నటించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాతలు విడుదల చేయబోతున్నారు. ధనుష్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరాలను అందిస్తున్నారు. ఊపిరి తరహాలో నాగ్ మరో హిట్ ను కొడతారేమో చూడాలి.












Click it and Unblock the Notifications