తెలుగు సినీ చరిత్రలో 'బేబీ' సంచలన రికార్డ్..పవన్, మహేష్ వల్లే కాలేదుగా..!
'బేబీ' సినిమా ఎంతటి సంచలనం విజయం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆనంద్ దేవరకొండ,వైష్ణవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. యువతి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించడం అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఒకే సమయంలో ప్రేమించిన వారిని అమ్మాయి ఎలా మోసిందో బేబీ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

వాస్తవరూపానికి దగ్గరగా ఉండటంతో బేబీ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సైతం 'బేబీ' సినిమాపై ప్రశంసలు కురింపించారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ సినిమాలాగా కలెక్షన్లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ఓ రికార్డు సొంతం చేసుకుంది. తెలుగు సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమాల జాబితాలో మూడో స్థానాన్నిఆక్రమించింది.

రూ 7.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు, 33.57 కోట్ల లాభాలు వచ్చినట్టు బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.దీంతో బేబీ అత్యధిక లాభాలు పొందిన సినిమాల లిస్ట్‌లో మూడో స్థానానంలో నిలిచింది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన 'గీతా గోవిందం' సినిమా మొదటి స్థానంలో నిలిచింది. బాక్సాఫీస్ వద్ద గీతా గోవిందం కలెక్షన్ల సునామి సృష్టించింది. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ 55.43 కోట్లు లాభాలు తెచ్చిపెట్టి..అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాల జాబితాలో టాప్‌లో నిలిచింది.

ఇక హీరో నిఖిల్ నటించిన 'కార్తీకేయ-2' సినిమా 2వ స్థానంలో నిలిచింది. రూ 12.8 కోట్లతో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు రూ 45.60 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల తరువాత 'బేబీ' సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఉప్పెన, ఫిధా సినిమాలు లాభాలు పొందిన సినిమాల లిస్ట్‌లో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి.
Note: ప్యాన్ ఇండియా సినిమాలను ఈ జాబితాలో చేర్చలేదు.












Click it and Unblock the Notifications