Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత!!

హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రభుత్వానికి, బీజేపీ నేతలకు మధ్య వార్ కు తెర తీసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం లేదని, ఇప్పటివరకు నిమజ్జనోత్సవానికి కావలసిన ఏర్పాట్లను చేయడం లేదని బీజేపీ తో పాటు హిందూ సంఘాల నాయకులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ చేస్తామన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ చేస్తామన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

ఇప్పటికీ వినాయక నిమజ్జనోత్సవాలకు హుస్సేన్ సాగర్ తో పాటు, ప్రతి ఏడాది నిర్వహించినట్టే ఘనంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి, వినాయక నిమజ్జనోత్సవానికి తగిన ఏర్పాట్లు చేయకుంటే ప్రగతి భవన్ లో గణేష్ నిమజ్జనం నిర్వహిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే క్రమంలో నిమజ్జనం ఏర్పాట్లపై అధ్యయనం చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని, నేడు ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ చేపట్టి ఆపై కార్యాచరణ ప్రకటిస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది.

బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తెలుగుతెల్లి ఫ్లై ఓవర్ వద్ద ఉద్రిక్తత

బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. తెలుగుతెల్లి ఫ్లై ఓవర్ వద్ద ఉద్రిక్తత


ఈ మేరకు నేడు ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించిన భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నేతలను పోలీసులు అడ్డగించారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్ ద్వారా నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టాలని గణేష్ ఉత్సవ సమితి భావించిన నేపథ్యంలో, బైక్ ర్యాలీ చేయడానికి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. బైక్ ర్యాలీ నిర్వహించడానికి వెళ్లిన ఉత్సవ సమితి నేతలను అడ్డుకున్నారు. దీంతో హైద్రాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఆందోళన చేపట్టిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అరెస్ట్

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ఆందోళన చేపట్టిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అరెస్ట్

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. గణేష్ ఉత్సవాలను సరిగా నిర్వహించని తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న భాగ్యనగర గణేష్ సమితి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చెయ్యాలని డిమాండ్

హుస్సేన్ సాగర్ లో నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చెయ్యాలని డిమాండ్

హుస్సేన్ సాగర్ లోనే గణేష్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల వంకతో వినాయక నిమజ్జనోత్సవాన్ని నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మండిపడుతున్నారు. గత ఏడాది ఏ విధంగా అయితే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారో ఈ సంవత్సరం కూడా అదే విధంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర గణేశ ఉత్సవ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+