భారత్ జోడో యాత్ర:తెలంగాణలో ప్రవేశం ఇప్పుడు, 3 సభల నిర్వహణ: రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. విమర్శలు వస్తోన్నా.. వాటిని తమకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 350 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. యాత్రకు సంబంధించిన వివరాలను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాత్రకు వస్తోన్న స్పందన చూసి ఓర్వలేకే.. కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కేరళలో యాత్ర..
భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. నాలుగు రోజులపాటు తమిళనాడులో కొనసాగిన తర్వాత శనివారం కేరళలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ఎలా కొనసాగనుందన్న విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

తెలంగాణలో ప్రవేశం
అక్టోబర్ 24న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మక్తల్‌లో రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 15 రోజులపాటు సాగనున్న రాహుల్ యాత్ర 350 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని చెప్పారు. మక్తల్ నుంచి నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ వరకు సాగే యాత్రలో 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని రేవంత్ తెలిపారు.

కన్యాకుమారి నుంచి యాత్ర
భారత్ జోడో యాత్రను యువ నేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన యాత్ర కొనసాగుతోండగా.. రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్‌పై రగడ నెలకొంది. దాని ధర రూ.40 వేలకు పైగా ఉండటంతో.. అంతా కాస్ట్లీ డ్రెస్ ధరించి పేదరికం, సమస్యల గురించి రాహుల్ గాంధీ ఏం చెబుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

బీజేపీ విమర్శలు
బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. భారత్ జోడో యాత్రకు వస్తోన్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక బీజేపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారని కాంగ్రెస్ తెలిపింది.












Click it and Unblock the Notifications