Bigg Boss Telugu:ఈ వారం నో ఎలిమినేషన్.? ఒకవేళ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయ్యేది ఎవరంటే..?
బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు...? ప్రేక్షకులు వేసే ఓట్లను బిగ్‌బాస్ గౌరవిస్తారా లేక ఈ సారి కూడా ఏదైనా జిమ్మిక్ ప్లే చేసి ఒకరి బదులు మరొకరిని ఇంటి నుంచి బయటకు పంపుతాడా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఈ మెగా ఈవెంట్‌ను ఫాలో అవుతున్న వారి మదిలో తొలుస్తున్న ప్రశ్నలు. అయితే ఇప్పటికే డేంజర్ జోన్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లలో ఒకరు తప్పని పరిస్థితుల్లో ఎలిమినేట్ కావాల్సిందే. ఆ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ప్రేక్షకులు ఇట్టే చెబుతున్నా షో నిర్వాహకులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మోనాల్ హౌజ్‌లో కొనసాగుతుందా..?
బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి ఈ సారి కచ్చితంగా మోనాల్ గజ్జర్ ఇంటి నుంచి ఎగ్జిట్ ఇవ్వనున్నట్లు సమాచారం. మోనాల్ ఇప్పటి వరకు ప్రతి సారీ నామినేషన్స్‌లో వస్తున్నప్పటికీ ఏదో ఒకలా సేవ్ అవుతోంది... కాదు కాదు.. సేవ్ చేస్తున్నారు. అయితే మోనాల్‌ను సేవ్ చేస్తోంది మాత్రం ప్రేక్షకులు కాదట.. బిగ్‌బాస్ నిర్వాహకులని సమాచారం. అంతేకాదు మోనాల్ పట్ల హోస్ట్ నాగార్జున కూడా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ కలిగి ఉన్నాడనే విషయం షోను ఫాలో అవుతున్న చాలామంది ప్రేక్షకులకు అర్థం అవుతోంది. ఇక మోనాల్ గజ్జర్ తన పెర్ఫార్మెన్స్‌తో చాలామంది సెలబ్రిటీలను సైతం అట్రాక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మోనాల్-అఖిల్ మధ్య ప్రతి టాస్కులోను ఏదో క్లాష్ అవుతోంది. షోలో వివిధ కారణాలతో వీరు బిగ్‌బాస్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు.

కుమార్ సాయి ఎలిమినేషన్‌తో భగ్గుమన్న నెటిజెన్లు
ఇవన్నీ పక్కనపెడితే ఈ సారి మాత్రం మోనాల్ ఇంటినుంచి ఎగ్జిట్ అవుతున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం టీఆర్‌పీ రేటింగ్స్ కోసమే బిగ్ బాస్ షో నిర్వాహకులు మోనాల్‌ను ఇంట్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఇక విమర్శలు ఎక్కువగా రావడంతో నిర్వాహకులు కూడా మోనాల్‌ను పంపించేద్దామనే ఫిక్స్ అయ్యారట. ఇక కుమార్ సాయి ఎలిమినేషన్ తర్వాత షో టీఆర్పీలు పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.అంతేకాదు కుమార్ సాయి ఎలిమినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగలేదని అతని ఎలిమినేషన్‌పై అనుమానాలున్నాయంటూ బిగ్‌బాస్ షో నిర్వాహకులను సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు నెటిజెన్లు.
Recommended Video

ఈ సారి ఎలిమినేషన్ ఉంటుందా..?
ఇక తిరిగి ప్రేక్షకుల మన్ననలు పొందేందుకు మోనాల్‌ను ఇంటి నుంచి పంపేందుకు బిగ్‌బాస్ ఫిక్స్ అయ్యాడట. అయితే మోనాల్ ఇంట్లో ఉంటుందా లేక ఎగ్జిట్ అవుతుందా అని మాత్రం పక్కాగా చెప్పలేము. మోనాల్ తన పెర్ఫార్మెన్స్‌తో ఓ వర్గం ప్రేక్షకులను దక్కించుకుంది. అంతేకాదు కాస్త స్కిన్ షోతో కూడా ఎపిసోడ్స్‌ను రక్తి కట్టించింది. ప్రస్తుతం డేంజర్ జోన్లో నోయల్ సీన్ మోనాల్ గజ్జర్‌లు ఉన్నారు. వీరిలో మోనాల్ ఈ సారి ఎలిమినేట్ అవుతుందని నెటిజెన్లు బలంగా నమ్ముతున్నారు. ఈ సారి కూడా అనుకున్నదొక్కటి జరిగేది మరొకటి అయితే మాత్రం షో పై చాలామందికి నెగిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సారి ఎలిమినేషన్ కూడా ఉండకపోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం నాగార్జున ఈ వారాంతంలో ఉండరనే వార్త జోరుగా ప్రచారం ఉంది. వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ కోసం నాగ్.. మనాలీకి వెళ్లినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications