Bigg Boss Telugu:నాగార్జునకు తప్పని ట్రోలింగ్ బెడద.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజెన్లు, ఎందుకంటే..!
హైదరాబాదు: బిగ్‌బాస్ 8వ వారంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయి. ఎలిమినేషన్ ఉంటుందని షో ఆసాంతం ఎదురుచూసిన ప్రేక్షకులకు బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా అతన్ని సేవ్ చేయడంలో ఆంతర్యమేంటని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై నాగార్జునను బిగ్‌బాస్ షో నిర్వాహకులను నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

నాగార్జునపై నెటిజెన్ల ఆగ్రహం
బిగ్‌బాస్ షో ఎలిమినేషన్ ప్రక్రియపై ఇప్పటికే పలు అనుమానాలున్నాయి. అసలు ఎలిమినేషన్ సరైన ప్రక్రియలో జరగడం లేదనేది ప్రేక్షకులు చెబుతున్నారు. ఒకరిని కాపాడేందుకు మరొక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను ఇంటి నుంచి నిర్వాహకులు పంపుతున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా ఎలిమినేట్ కావాల్సి ఉన్న అమ్మ రాజశేఖర్ కూడా చివరి నిమిషంలో నాగార్జున సేవ్ చేయడం... అది కూడా నోయల్ చెప్పడంతో సేవ్ చేస్తున్నామని చెప్పడాన్ని నెటిజెన్లు తప్పుబడుతున్నారు.

నోయల్ ఎక్కువా.. ప్రేక్షకులు ఎక్కువా.?
బిగ్‌బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ ఆది నుంచి వివాదంగానే కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ను ఎలిమినేట్ చేసినట్లే చేసి నోయల్ సేవ్ చేయమన్నారని నాగార్జున చెప్పడాన్ని ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. అంత మాత్రందానికి ప్రేక్షకులు ఓటింగ్‌లు, ప్రేక్షకులే దేవుళ్లు అనే డైలాగులు చెప్పడం దేనికని నాగార్జునను నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. నోయల్ చెబితే ఎలిమినేషన్ నుంచి తప్పించేస్తారా.. ? అని ప్రశ్నిస్తున్నారు. షో చూసే ప్రేక్షకులు ఎక్కువా లేక నోయల్ ఎక్కువా అని అడిగి కడిగి పారేస్తున్నారు. దీంతో మళ్లీ బిగ్‌బాస్ షో పై మరో మచ్చ పడింది. ఎనిమిదవ వారంలో అంత హైప్ క్రియేట్ చేసి ఎవరినీ ఎలిమినేట్ చేయకపోవడంపై నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఆది నుంచి వివాదమే
బిగ్ బాస్ షో ఇంత గ్రాండ్‌గా నడుస్తోందంటే అందుకు కారణం ప్రేక్షకులైతే... అలాంటి ప్రేక్షకుల ఓట్లకే విలువ లేకుండా పోతోందని నిర్వాహకులపై సోషల్ మీడియా వేదిక ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా ప్రతిసారి ఎలిమినేషన్ ప్రక్రియలో తప్పులను రిపీట్ చేస్తూ ప్రేక్షకులను మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. అంతేకాదు ఎగ్జిట్ అయిన కంటెస్టెంట్లు కూడా బయటకు వచ్చి ఇదే మాట చెబుతున్నారు. వారికి కావాల్సిన వారిని ఇంటిలో ఉంచి నిజాయితీగా ఆడుతున్న వారిని మాత్రం ప్రేక్షకుల ఓట్లతో పనిలేకుండా ఎలిమినేట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉంటే తొమ్మిదవ వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో అమ్మ రాజశేఖర్, అభిజీత్, దేత్తడి హారిక, మోనాల్, అవినాష్‌లు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications