• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చరిత్రలో తొలిసారి.. లాల్ దర్వాజలోనూ నిరాడంబరంగా బోనాలు.. పడుగపూట భార్యతో బీరు.. వైరల్..

|

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు రూపమైన ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. నాలుగోదైన చివరి ఆదివారం పాతబస్తీ లాల్‌దర్వాజలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరోనా కల్లోలం కారణంగా చరిత్రలో తొలిసారి బోనాల పండుగ నిరాడంబరంగా సాగింది. భారీ జనసందోహం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు లేకుండానే ఈసారి పండుగ గడిచిపోవడం గమనార్హం.

విశిష్ఠమైన లాల్ దర్వాజ బోనాల వేడుకలు ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకే ప్రారంభమయ్యాయి. మొదట అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కళ్యాణం జరగనుంది. అక్కన్న- మాదన్న ఆలయంలతో పాటు అన్ని పురాతన అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. కరోనా నిబంధనల కారణంగా ఆయా ఆలయాల్లో ఆలయ కమిటీలు మాత్రమే బోనాలు సమర్పించగా, ప్రజలంతా ఇంటి వద్దే పండుగ జరుపుకొన్నారు.

bonalu festival: amid covid-19, lal darwaja bonalu went simple, chef sanjays video gone viral

కరోనా నేపథ్యంలో భక్త సమూహాలను ఆలయంలోకి రానీయకుండా లాల్ దర్వాజ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగుల చింత నుంచి లాల్ దర్వాజా, ఓల్డ్ ఛత్రినాక పోలీస్ స్టేషన్ నుంచి లాల్ దర్వాజా, గౌలిపురా లాల్ దర్వాజా రోడ్లను ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా మూసేశారు. ఆదివారం జంట నగరాలలో మొత్తం 1200 నుంచి 1300 వరకు చిన్నా పెద్ద అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలను నిర్వహించారు.

జగన్ భార్య భారతికి బ్లాక్‌మనీ లింకులు.. బాలినేని ఘటనపై లోకేశ్ బాంబు.. సాయిరెడ్డి లోకజ్ఞాన ప్రబోధ

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు ప్రధానంగా, హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం, చాంద్రాయణగుట్ట కుమ్మర్‌వాడి శ్రీ కనక దుర్గ దేవాలయం, మీరాలంమండీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, బేలా చందూలాల్ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, దూద్‌బౌలి శ్రీ పైనీరు ముత్యాలమ్మ దేవాలయం, మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, సుల్తాన్‌షాహి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, గౌలిపురా శ్రీ భారతమాత కోటమైసమ్మ దేవాలయం, , బేలా శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, హరిజనబస్తీ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్భార్ మైసమ్మ దేవాలయం తదితర ఆలయాలలో నిర్వహకులు, పూజారులు కలిసి అమ్మవారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి, బోనాలు సమర్పించారు.

bonalu festival: amid covid-19, lal darwaja bonalu went simple, chef sanjays video gone viral
  పోలీస్‌కు 'ముద్దు' పెట్టిన మందుబాబు (వీడియో)

  బోనాల పండుగలో మాంసాహారం, మద్యపానం సాధారణ అంశాలన్న సంగతి తెలిసిందే. బోనం సమర్పించిన తర్వాత అత్యధిక కుటుంబాలు ఇదే పని చేయడం పరిపాటి. ''బోనాల పండుగ నాడు భార్యతో బీరు తాగినవాడే అసలైన మగాడు.. ''అంటూ ప్రఖ్యాత చెఫ్ సంజయ్ తుమ్మ రూపొందించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను దీనిని షేర్ చేస్తున్నారు.

  English summary
  amid coronavirus spread, officials conducted lal darwaja bonalu celebrated in a simple manner ever in history. on the occasion of bonalu chef sanjay thumma veer video gone viral
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more