నీహారిక-చైతన్య విడాకుల వార్తపై రంగంలోకి దిగిన చిరంజీవి?
ఏది సరైన వార్త?.. ఏది సరైన వార్త కాదు? అనేదాంట్లో స్పష్టత లేక మెగా అభిమానులు గందరగోళంలో ఉన్నారు.
చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నీహారిక.. తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో రెండురోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. కొన్ని నెలలుగా చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో ఏది సరైనది, ఏది సరైన వార్త కాదు అనే అయోమయంలో మెగా అభిమానులున్నారు.

పెళ్లి ఫొటోలు డిలిట్
కొన్నాళ్లుగా నీహారిక విడాకుల వ్యవహారానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. 2020 డిసెంబరులో నీహారిక.. చైతన్య జొన్నలగడ్డను వివాహమాడారు. అప్పటి నుంచి ఆమె వైవాహిక జీవితంలో ఉన్నారు. అనూహ్యంగా వీరిద్దరికి సంబంధించిన డివోర్స్ వ్యవహారం కొంతకాలం క్రితం తెరపైకి వచ్చింది. నీహారిక భర్త చైతన్య తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలు డిలిట్ చేశారు.
నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లేదు. నీహారిక- చైతన్య మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందుకే చైతన్య ఇలా పెళ్లి ఫొటోలు డిలిట్ చేశాడంటూ వార్త సర్క్యులేట్ అవుతోంది.

మొదటిగా స్పందించేది నాగబాబే
మెగా కుటుంబానికి సంబంధించి ఏదైనా వార్త సర్క్యులేట్ అవుతుంటే మొదటగా స్పందించేది నాగబాబు. అలాంటి వ్యక్తి నీహారిక విడాకులకు సంబంధించిన వార్తను ఖండించకపోవడంపై మెగా అభిమానుల అనుమానాలను రెట్టింపు చేస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా వీరిద్దరి విడాకులకు సంబంధించిన విషయమే హాట్ టాపిక్ గా మారింది. వీరికి సర్దిచెప్పడానికి చిరంజీవి రంగంలోకి దిగారనే విషయం కూడా ఈ ఇష్యూను పెద్దది చేస్తోంది.

ప్రయత్నాలు ప్రారంభించిన చిరంజీవి?
వీరిద్దరూ కలిసివుండేలా చేయడానికి చిరంజీవి ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు. 'ఒక మనసు' సినిమాతో కెరీర్ ఆరంభించిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్, సూర్యకాంతం లాంటి సినిమాల్లో నటించింది. అయితే అవేవీ ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.
దీంతో నటన పరంగా వెనుకడుగేసి నిర్మాతగా సత్తా చాటాలనే ప్రణాళికలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహమైన తర్వాత కూడా తన కెరీర్ ను కొనసాగిస్తున్న నీహారిక.. తన బ్యానర్ లో వెబ్ సిరీస్ లు తీస్తూ ఇప్పటికే కొన్ని విజయాలను అందుకున్నారు. నిర్మాతగా పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకునేది నీహారిక లక్ష్యంగా ఉంది.












Click it and Unblock the Notifications