ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు: ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: క్రిస్మస్‌కి ముందుగా రేపు(బుధవారం) క్రైస్తవ సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందు ఏర్పాటు చేయనున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు కేసీఆర్మ క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.
పబ్లికా గార్డెన్ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి, చాపల్ రోడ్ వైపు మళ్లింపు
అబిడ్స్ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు ఎస్బీఐ, గన్ ఫౌండ్రి, నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా మళ్లింపు
బషీర్‌బాగ్ నుంచి నిజాం కాలేజీ వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట్స్ మీదుగా మళ్లింపు
ఆంక్షల సమయంలో వాహనదారులు పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్‌బాగ్, గన్ ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్, రవీంద్ర భారతి, ఇక్వాల్ మినార్, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ కూడళ్ల వైపు రావొద్దని సూచించారు. ఎల్బీ స్టేడియంవైపు వచ్చేవారికి ముందస్తుగా పాస్‌లు జారీ చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

బుధవారం నుంచి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం కేసీఆర్ కిట్లను అందించనుంది. పథకాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం నుంచి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందజేయనుండగా.. కామారెడ్డి నుంచి వర్చువల్‌గా మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.
గర్భిణుల్లో పోషకాహార లోపం నివారణకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రాథమికంగా తొమ్మిది జిల్లాల్లో గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంనది. న్యూట్రిషన్ కిట్ల కోసం రూ.50కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారు. ఆయా కార్యక్రమాల్లో గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు మాతా, శిశు మరణాల నివారణ కోసం ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రవేశపెట్టింది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనుంది.












Click it and Unblock the Notifications