సీబీఐ అంటే కేసీఆర్‌కు వణుకు..? ఆగస్టులో జీవో ఇచ్చి.. ఇప్పుడు: డీకే అరుణ
ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి నో చెప్పింది. ఇదివరకే దర్యాప్తు సంస్థ విచారించేందుకు అంగీకారం తెలుపగా.. దానిని వెనక్కి తీసుకుంది. వాస్తవానికి సదరు జీవో కూడా ఆగస్టు నెలలో ప్రభుత్వం విడుదల చేసింది. ఎమ్మెల్యేల ఇష్యూ రాగా.. ఇప్పుడు తెరపైకి వచ్చింది. ప్రభుత్వ విధానాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తప్పుపట్టారు.
సీబీఐని చూసి తెలంగాణ సీఎం కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేశారని ఆ భయం అని అడిగారు. జీవో 51 ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకొచ్చారని అడిగారు. ఆగస్టు నెలలో ఇష్యూ చేసి.. ఇప్పుడు తెరపైకి రావడంలో అంతర్యం ఏమిటని అడిగారు. తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముందని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. సీబీఐకి గతంలో ఇచ్చిన సమ్మతిని ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని అడిగారు. ఆగస్ట్ నెలలో విడుదల చేసిన జీవో.. ఇప్పటివరకు రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని దోచుకోకుంటే.. పేదల భూములను ధరణి పేరుతో కబ్జా చేయకుంటే అంటూ ఫైరయ్యారు. సీబీఐ అంటే అంత ఉలికిపాటెందుకని డీకే అరుణ ఫైరయ్యారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ చేసే ప్రయత్నాలు ఇకపై సాగవని చెప్పారు. జీవో 51 జారీ చేసి కేసుల నుంచి తప్పించుకోవచ్చని అనుకోవడం అమాయకత్వం అవుతుందని పేర్కొన్నారు. తప్పు చేసి, ప్రజల సొమ్మును కాజేసిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా బయటకు తీసుకొస్తామని తేల్చిచెప్పారు.
మునుగోడు బై పోల్ వేళ.. రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. ఆ క్రమంలోనే జీవో తీసుకురావడంతో మరింత దుమారం రేగింది. దీనిని డీకే అరుణ తప్పుపట్టారు.