పారాలింపక్స్ పతక విజేత దీప్తి జివాంజీకి భారీ నజరానా ప్రకటించిన రేవంత్

పారాలింపిక్స్‌లో కాంస్య పతక విజేత జీవాంజీ దీప్తికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. 400 మీటర్ల పరుగు టీ20 విభాగంలో కాంస్య పతకం సాధించారుదీప్తి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. దీప్తిని అభినందించారు. ప్రభుత్వం తరపున రూ. కోటి తోపాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం దీప్తికి ఇస్తామని ప్రకటించారు. ఇక, ఆమె కోచ్ కు రూ. 10 లక్షల నగదు బహుమతిగా ప్రకటించారు.

కాగా, పారిస్ పారాలింపిక్స్‌లో దీప్తి.. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించింది. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్తించింది. శనివారం దీప్తి కుటుంబ సభ్యులు, కోచ్, నేతలు, అధికారులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Revanth announced a huge Nazarana for Paralympics medalist Deepthi Jeevanji

పారాలింపిక్స్​‌లో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, ఇతర ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, శాట్ ఛైర్మన్​ శివసేనా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

దీప్తి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. వీరిది పేద కుటుంబమే అయినప్పటికీ.. దీప్తిని ఆమె తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. దీప్తికి మానసిక వైకల్యం. మేధోపరమైన బలహీనత ఉండటంతో పసితనంలో ఆమె కోసం తండ్రి యాదగరి తల్లడిల్లిపోయేవారు.

దీప్తికి ఫిట్స్ వస్తే తండ్రి విలవిల్లాడిపోయేవారు. దీప్తి క్రీడల్లో రాణించేందుకు డబ్బులకు వెనుకాడవద్దని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని కూడా అమ్మేశారు. తల్లిదండ్రుల ప్రోత్సహంతో దీప్తి తానేంటో ప్రపంచానికి చాటింది. తన మానసిక స్థితి కారణంగా ఇరుగుపొరుగువారి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న దీప్తి.. ఇప్పుడు రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవడంతో ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+