నిర్మలమ్మ మోడీ చేతిలో కీలు బొమ్మ.. దక్షిణాదికి మొండిచెయ్యే : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్‌పై పెదవి విరిచారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని మండిపడ్డారు. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే పథకాలు లేకుండా లోపభూయిష్టంగా బడ్జెట్ కూర్పు జరిగిందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రూపాయి పన్ను చెల్లిస్తే.. తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
దక్షిణాదిపై ఉత్తర భారతానికి చెందిన నేతల వివక్ష స్పష్టంగా అర్థం అవుతోందని ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఇన్‌కం ట్యాక్స్ లో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దక్షిణాదికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రధాని మోడీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు.

తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా.. సీఎం కేసీఆర్ నోరు మెదపకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. కేసులకు భయపడే కేసీఆర్ మౌనం దాల్చారని, బడ్జెట్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారంటే దానర్థమేంటని ఫైరయ్యారు. అదలావుంటే దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications