గాంధీ మెడికల్ కాలేజీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా .. టెన్షన్ లో వైద్య సిబ్బంది
హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . వందలాది కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ ఏ విధంగా అయినా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపధ్యంలో వారు ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా పేషెంట్ లకు సేవలు చేస్తున్నారు.
ఇక ఈ క్రమంలో గాంధీ మెడికల్ కాలేజీలో విధులు నిర్వర్తించే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియటంతో వైద్య సిబ్బంది టెన్షన్ పడుతున్నారు . దాంతో ఒక్కసారిగా మెడికల్ కాలేజీ సిబ్బందిలో కలవరం మొదలైంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తి మెడికల్ కాలేజీలో చాలామందిని కలిసిన నేపధ్యంలో అక్కడ పని చేస్తున్న సిబ్బంది టెన్షన్ పడుతున్నారు. అతడికి కాస్త అనారోగ్యం కలగటం, కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా సోకడం పట్ల మెడికల్ కాలేజీ సిబ్బందిలో భయాందోళన వ్యక్తం అవుతోంది.

కరోనా వచ్చిన ఆపరేటర్ డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలను కూడా కలిశాడు. ఇక ఆ హెచ్ఓ డీ లు ఇప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది . అయితే కరోనా సోకిన బాధితుడు అయిన డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇప్పటివరకూ డిపార్టమెంట్లో ఎంతమందిని కలిశాడు? బయట ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు అనే విషయాలని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా బాధితుడు పనిచేసే డిపార్ట్ మెంట్లో పనిచేసే మిగతా అందరికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా పేషెంట్ ల కోసం యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా సోకటం వైద్య వర్గాలకు పెద్ద టెన్షన్ గా మారింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications