హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కలకలం- మళ్లీ కరోనా వ్యాప్తి -కొత్తగా 247 కేసులు, ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

దక్షిణాదిలో కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉందని భావిస్తోన్న తెలంగాణలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తున్నది. ఒక దశలో మరణాలేమీ లేకుండా, కొత్త కేసులు వందలోపే ఉండగా, గడిచిన వారం రోజులుగా పరస్థితి మెల్లగా ప్రమాదకరంగా మారుతోంది..

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్! తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు -పవన్‌ పరిస్థితేంటి? -చింతాకే కాంగ్రెస్ టికెట్!

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. నిన్న రాత్రి 8 గంటల వరకు 60,527 టెస్టులు నిర్వహించాగా, కొత్తగా 247 మందికి కొవిడ్ పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 3,01,769కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 1659కి పెరిగింది.

covid-19 in telangana: 247 new cases, three deaths in last 24 hrs, state tally at 3,01,769

కరోనా బారి నుంచి నిన్న 158 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,98,009కి చేరింది. కాగా, రికవరీ రేటు మెరుగ్గా ఉన్న తెలంగాణలో కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. యాక్టివ్ కేసులు మళ్లీ 2వేల మార్కును దాటాయి. ప్రస్తుతం 2,101 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 716 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు బులిటెన్ లో తెలిపారు.

మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!మసాజ్ సెంటర్లలో మారణహోమం -అమెరికాలోని అట్లాట సిటీ కాల్పుల్లో 8మంది మృతి -జాబితాలో మనవాళ్లు!

కొత్త కేసులకు సంబంధించి రాజధాని హైదరాబాద్ మళ్లీ టాప్ లో ఉంది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 29 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 93,59,772కి చేరింది. కాగా, తెలంగాణతోపాటు దేశమంతటా కొత్త కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో..

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరగనుంది. పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షిస్తారు. కరోనా నియంత్రణ చర్యలపై నేతలు చర్చిస్తారు.

English summary
covid-19 cases are booming again in Telangana. According to a bulletin released by the state health Department on Wednesday, 247 new people have been diagnosed with corona positive in the past 24 hours. In the state, 158 people recovered from the corona and three died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X