Priyanka murder: ఎప్పుడేం జరిగిందంటే.: సీపీ సజ్జనార్ చెప్పిన కీలక విషయాలు

హైదరాబాద్: ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం రాత్రి నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసులో నిందితులందరూ నారాయణపేట జిల్లాకు చెందినవారేనని తెలిపారు.

మీకు మేమున్నాం.. 100కు కాల్ చేయండి..

మీకు మేమున్నాం.. 100కు కాల్ చేయండి..

ఈ కేసులో ఏ1 మహ్మద్ అలియాస్ ఆరిఫ్, లారీ డ్రైవర్, ఏ2 జొల్లు శివ, ఏ3 నవీన్, ఏ4గా చింతకుంట చెన్నకేశవులు ఉన్నారని సీపీ తెలిపారు. ఎవరైనా తాము ఆపదలో ఉన్నామని అనుమానం కలిగితే వెంటనే 100 నెంబర్‌కు కాల్ చేయాలని సీపీ కోరారు. ఎవరైనా ఫోలో అయినా.. వెహికిల్ పాడైపోయినా కూడా మహిళలు, యువతులు, వృద్ధులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. తెలంగాణ పోలీసులు వెంటనే సహాయం అందిస్తారని సీపీ సజ్జనార్ చెప్పారు. కేవలం 5 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుంటారని తెలిపారు. షీటీమ్స్ నెంబర్‌ 9490617444, సైబరాబాద్ పోలీస్ కంట్రోల్ రూం 9490617100 కాల్ చేయాలని సీపీ కోరారు. ‘హ్యాక్‌ఐ'ని కూడా సంప్రదించవచ్చని తెలిపారు.

Recommended Video

    Vet Doctor Murder Case Solved, Four People Arrested
    నక్షత్రకాలనీలోని నివాసం నుంచి..

    నక్షత్రకాలనీలోని నివాసం నుంచి..

    నవంబర్ 27న సాయంత్రం 5.50కి నక్షత్రకాలనీలోని తన నివాసం నుంచి ప్రియాంక బయల్దేరిందని, సాయంత్రం 6.08కి టోల్ ప్లాజా తొండపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. 6.12కి అక్కడ తన వాహనం పార్క్ చేసేందుకు ప్రయత్నించగా సిబ్బంది వద్దనడంతో.. మరోచోట 6.13కి వాహనం నిలిపింది.

    టైర్ పంక్చర్ చేసి..

    టైర్ పంక్చర్ చేసి..

    ఆ తర్వాత అక్కడ్నుంచి గచ్చిబౌలికి బయల్దేరి వెళ్లింది. తిరిగి అదే రోజు సాయంత్రం 9.13కి గచ్చిబౌలి నుంచి తొండపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. స్కూటీ టైర్ పంక్చర్ అయ్యిందని గుర్తించింది. దీంతో మా వాడు పంక్చర్ చేయించుకుని వస్తాడని మహ్మద్.. ప్రింయాకకు చెప్పాడు. స్కూటీ టైర్ పంక్చర్ అయ్యిందని.. మహ్మద్ చెప్పడంతో శివ 9.23కి ఆ స్కూటీని రిపేర్ చేసేందుకు తీసుకెళ్లాడు. కాగా, తన సిస్టర్‌కు కాల్ చేసింది ప్రియాంక.

    ముక్కు, నోరు మూసి ప్రియాంకపై దారుణం..

    ముక్కు, నోరు మూసి ప్రియాంకపై దారుణం..

    రాత్రి 9.28కి పంక్చర్ షాప్ మూసివుందని వచ్చి మళ్లీ వెళ్లాడు శివ. రాత్రి 9.35గంటలకు శివ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 9.45కి ప్రియాంక ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఆ తర్వాత నలుగురు నిందితులు ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. ముక్కు, నోరు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో రాత్రి 10.30కి ప్రియాంక మృతి చెందింది. దీంతో ఆమె బాడీని లారీ కేబిన్‌లో పెట్టి అక్కడ్నుంచి బయల్దేరారు. మొదట టూవీలర్ మీద ఇద్దరు బయల్దేరారు. 10.33కి లారీ బయల్దేరింది.

    ప్రియాంక బాడీని కాల్చేందుకు..

    ప్రియాంక బాడీని కాల్చేందుకు..

    నందిగామ వద్ద పెట్రోల్ కొందామనుకుంటే సిబ్బంది ఇవ్వకపోవడంతో మరో పెట్రోల్ బంక్‌లో నిందితులు పెట్రోల్ తీసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 2-2.30గంటల మధ్యలో ప్రియాంక బాడీని నిందితులు కాల్చేశారు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
    ఈ నేరం చేసిన నిందితులు మొత్తం 28.37 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలిపారు. బాధితురాలి కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించవద్దని సీపీ కోరారు. వారి వద్దకు ఎవరూ వెళ్లవద్దని మీడియాను కోరారు.

    ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుతో..

    ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదుతో..


    27న రాత్రి 11.25గంటలకు ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. వెంటనే ఓ కానిస్టేబుల్ బాధితురాలి తండ్రి వెంట వెళ్లి టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారని చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వస్తున్న ఆరోపణలపై విచారణ చేస్తామని సీపీ తెలిపారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
    గురువారం తెల్లవారుజామున 2.30కి మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. బాధితురాలి తండ్రితోపాటు ఓ కానిస్టేబుల్, ఇతర పోలీసులు గురువారం ఉదయం 5.30గంటల వరకు వెతికారని చెప్పారు.

    విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి..

    విచారణ తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి..


    నిందితులను విచారిస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. టోల్ ప్లాజా వద్ద ప్రియాంక తన స్కూటీని పెట్టడంతోనే నిందితులు ఆ ఆలోచన చేశారని చెప్పారు. నిందితులను బాధితురాలు అమాయకంగా నమ్మిందని అన్నారు. నిందితులు లారీ క్యాబిన్లో కూర్చునే మద్యం సేవించారని చెప్పారు. అపాయంలో, ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసిన వెంటనే మహిళలు, యువతులు, పిల్లలు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీపీ కోరారు. పోలీసు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుందని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+