దిశ అత్యాచారం,హత్యకేసు ... కస్టడీ పిటీషన్ రేపటికి వాయిదా
దిశ అత్యాచారం, హత్యకేసు ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు, షాద్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా విచారణ చేపట్టాల్సి ఉందని, నిందితులను మరింత విచారణ చెయ్యాలని పిటీషన్ లో పేర్కొన్న పోలీసులు , నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
దిశ గ్యాంగ్ రేప్,హత్య ఘటనపై సీఎం కేసీఆర్ ది మొక్కుబడి ప్రకటన .. విజయశాంతి ఫైర్
ఇక ఈ కస్టడీ పిటిషన్ ను పరిశీలించిన షాద్ నగర్ కోర్టు ఇన్ చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేని కారణంగా విచారణను రేపటికి వాయిదా వేసింది. రేపు పోలీసుల కస్టడీ పిటీషన్ పై విచారణ జరగనుంది . ఇక నిందితులు చర్లపల్లి జైలులో ఉన్నారు. దీంతో చర్లపల్లి జైలు వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.ఇంకా రాష్ట్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇతర ఖైదీలు వారిపై దాడి చేసి చంపేస్తారేమోనన్న అనుమానంతో, నిందితులకు ప్రత్యేకంగా హైసెక్యూరిటీ సింగిల్ బ్యారక్ కేటాయించింది జిల్లా శాఖ .

ఇక ఈ ఘటనపై ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దిశ హత్యోదంతంపై సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కదిలించినా భగ్గుమంటున్నారు. నేడు దిశ హత్యోదంతంపై పార్లమెంట్ దద్ధరిల్లింది. పార్లమెంటు ఎంపీలు ఈ దుర్ఘటనపై చర్చించారు. ఈ ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభ, రాజ్యసభలో ఈ అంశంపై గట్టిగా మాట్లాడారు. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు ఇక రాజ్యసభలో జయాబచ్చన్ తదితరులు ఈ అంశంపై చర్చించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!