కేసీఆర్‌పై జేజమ్మ ఫైర్.. తాకట్టు పెట్టారా అంటూ ఫైర్
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు జేజమ్మ డీకే అరుణ ఫైరయ్యారు. జూరాల వద్ద కాలు అడ్డం పెట్టి ఏపీ అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఆపుతానని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. ఏపీ సీఎం జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారా అని మండిపడ్డారు. ఆర్డీఎస్ కుడి కాలువతోపాటు ఇతర ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపడుతుందన్నారు. కేసీఆర్ సోయి లేకుండా ఉన్నారని దుయ్యబట్టారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. పాత సచివాలయం వాస్తు వెన్నుపోటుకు అనుకూలంగా ఉందన్నారు. మేనల్లుడు హరీశ్ రావు భయంతో దాన్ని కూల్చేశారని విమర్శించారు. మంత్రి హరీశ్ రావుపై అరుణ మండిపడ్డారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయకూడదనే ఇంగితం కూడా హరీశ్ రావుకు లేదని అన్నారు.

కేంద్ర జలశక్తి శాఖకు బండి సంజయ్ రాసిన లేఖలో ఏముందో తెలిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పిస్తే మీరు ఎంత నీతిమంతులో అర్థమవుతుందన్నారు. మీ అడ్డగోలు అవినీతి బయటపడుతుందని... జనాలు మిమ్మల్ని పేడతో కొడతారని చెప్పారు. అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన హరీశ్ రావు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నేతలు కటకటాలను లెక్కించే సమయం ఎంతో దూరంలో లేదన్నారు.












Click it and Unblock the Notifications