Hyderabad: రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్.. దొరికితే రూ.15 వేల ఫైన్..!

న్యూ ఇయర్ అంటే గుర్తుకు వచ్చేది ఏమిటి.. ఎంజాయ్ చేయడం. ముఖ్యంగా తెలంగాణలో అయితే డిసెంబర్ 31న తెగ ఎంజాయ్ చేస్తారు. తాగడం, తినడం చేస్తుంటారు. ఆ రోజు వైన్ షాపులు, చికెన్ సెంటర్లు, బెకరీలు రద్దీగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది పబ్బులు, క్లబ్బులకు వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ డిసెంబర్ 31న చాలా సందడిగా ఉంటుంది.

డిసెంబర్ 31 రోజు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 31 సాయింత్రం నుంచే తనిఖీలు చేపట్టనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. ఈ తనిఖీల్లో బయటపడితే రూ.15000 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మొదటిసారి డ్రంక్ అండ్ చేసినవారికి రూ. 10,000 ఫైన్ విధిస్తామని పేర్కొన్నారు. జైలు శిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు.

Drunk and drive checks will be conducted in Hyderabad from 8 pm onwards

ఆదివారం రాత్రి 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు. జరిమానాలు, జైలు శిక్షతో పాటు తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అతి చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు.

బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేస్తారు.

ఔటర్ రింగ్ రోడ్, PVNR ఎక్స్‌ప్రెస్‌వేలు కూడా మూసివేస్తారు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. క్యాబ్‌లు, టాక్సీలు, ఆటో-రిక్షాల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని పోలీసులు చెప్పారు. రైడ్‌ను తిరస్కరిస్తే రూ. 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+