Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ దారిలో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్ లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా చోట్ల ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శిల్పా లేఅవుట్లెవల్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా ఐదు రోజుల పాటు గచ్చిబౌలి జంక్షన్ లోని ఫ్లై ఓవరు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా కొండాపూర్ వైపు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఫ్లై ఓవర్ ను త్వరిత గతిన పూర్తి చేయడానికి శరవేగంగా పనులు చేస్తున్నారు. దీంతో ఆగస్ట్ 8 నుంచి 12వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గచ్చిబౌలి ఫ్లైఓవర్ మూసివేస్తున్నారు. ఆ సమయంలో బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్ కింది నుంచి టెలికాంనగర్, గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ వైపు మళ్లీంచనున్నారు. ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్ పక్క నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా బయోడైవర్సిటీ వైపు మళ్లీస్తారు.

అటు అంబర్ పేటలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతోన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబర్‌పేట-గోల్నాక మధ్య వెళ్లే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.ఫ్లై ఓవరు పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. 6 నంబర్ జంక్షన్ నుంచి గోల్నాకకు వెళ్లే వాహనాలు జిందా తిలిస్మత్‌కు రోడ్డు వైపు నుంచి వెళ్లాలి. గోల్నాక నుంచి 6వ నంబర్ జంక్షన్ వరకు ఆంక్షలు లేకుండా ట్రాఫిక్ యధావిథిగా ట్రాఫిక్ ను అనుమతించనున్నారు.
ఎన్‌సిసి గేట్ నుంచి 6 నంబర్ జంక్షన్‌కు వచ్చే ఆర్‌టిసి బస్సులను తిలక్ నగర్ ఎక్స్ రోడ్‌లో ఫీవర్ ఆసుపత్రి వైపు వెళ్లేలే చర్యలు తీసుకుంటున్నారు. అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆ దిశగానే పనులు కొనసాగుతోన్నాయి.












Click it and Unblock the Notifications