Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి బంద్.. ఎందుకంటే..!
హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు. పనుల నిర్వహణ మాన్యువల్ ప్రకారం స్టే కేబుల్ సిస్టమ్‌ను ఇంజినీర్లు తనిఖీ చేస్తారని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
అందుకే ఏప్రిల్ 6 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి బంద్ చేస్తున్నట్లు చెప్పింది. 100-టన్నుల క్రేన్‌లను 100-టన్నుల క్రేన్‌లను పైలాన్‌ల దగ్గర P1, P2 వద్ద తనిఖీ చేసే పనిని చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మళ్లించనున్నారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద కుడి మలుపునకు మళ్లించి.. మాదాపూర్ L&O PS వైపు - ఎడమ మలుపు - COD జంక్షన్ - సైబర్ టవర్లు - ఎడమ మలుపు - నిమ్మ చెట్టు జంక్షన్ - IKEA రోటరీ వైపు మళ్లిస్తారు.రోడ్ నెం 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ రోడ్డు నెం.45లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వద్ద మళ్లిస్తారు.
డి-మార్ట్ ముందు ఎడమ మలుపు - వసంత్ ఎంబ్రాల్డ్ గార్డెన్స్ - ఎడమ మలుపు - HMWSSB - కుడి మలుపు - నెక్టార్ గార్డెన్ రోడ్డు. నెక్టార్ గార్డెన్ కాలనీ నెక్టార్ గార్డెన్ జంక్షన్ దుర్గం చెరువు, ఐ ల్యాబ్స్ , ITC కోహినూర్, మై హోమ్ అబ్రా జంక్షన్, C గేట్ జంక్షన్ Ikea, బయో డైవర్సిటీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్, ఐ-ల్యాబ్స్, దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ జంక్షన్, డాక్టర్స్ కాలనీ, డి - మార్ట్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications