బీజేపీ పండుగకు కేసీఆర్ సంబరాలు సిగ్గుచేటు; కేసీఆర్ సర్కారును బొందపెట్టడం ఖాయం: ఈటల రాజేందర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.పెరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . టిఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం అని ఇప్పటికే పేర్కొన్న ఈటల రాజేందర్ తెలంగాణలోనే కెసిఆర్ కు దిక్కులేదని, అలాంటప్పుడు దేశ్ కి నేత ఎలా అవుతాడు అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలుగా మారతాయి
కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఫ్రెండ్లీ పార్టీలుగా మారుతాయని పేర్కొన్నారు. విపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మద్దతు తెలపడంపై ఈటల రాజేందర్ బయటకే కాంగ్రెస్, టీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయి అంటూ మండిపడ్డారు.

ప్రజాధనాన్ని వృధా చేస్తూ టిఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కేసీఆర్
ప్రజా ధనాన్ని సీఎం కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రజాధనాన్ని వృధా చేస్తూ టిఆర్ఎస్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోందని ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చెల్లని కెసిఆర్ మొహం పక్క రాష్ట్రాల్లో చెల్లుతుందా అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కెసిఆర్ దోపిడి వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్ విమర్శించారు.

తెలంగాణా బీజేపీ పండుగకు కేసీఆర్ సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటు
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పండుగకు కెసిఆర్ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఈటల రాజేందర్ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్ సర్కారును బొంద పెట్టడం ఖాయమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపికి తెలంగాణ 20వ రాష్ట్రం కానుందని, వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని ఓడించి తీరుతామని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రజల సొమ్మును తన పార్టీ సొమ్ముగా వాడుకుంటున్నారని విమర్శించారు.
Recommended Video


కెసీఆర్ ముఖం చూడటానికి ప్రజలు ఇష్టపడటం లేదు
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్ దేశాన్ని ఏలుతారా అంటూ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కెసిఆర్ ముఖం చూడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రచార పిచ్చితో ఇతర రాష్ట్రాలలో హోర్డింగ్స్ పెట్టడం కోసం కెసిఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాధనంతో పండుగ చేసుకుంటున్న కెసిఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడతామని ఈటల రాజేందర్ తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications