ఫేక్ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్: సిటీలో ముఠా అరెస్ట్
నకిలీ ముఠాలు విజృంభిస్తున్నాయి. చివరికీ కరోనా వ్యాక్సిన్, ఆర్టీ పీసీఆర్ కూడా నకిలీవి ఇవ్వడం కలకలం రేపుతుంది. దీంతో నిజం ఏంటో.. అబద్దం ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది. భాగ్యనగరంలో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం రేపాయి. పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు పరఫరా చేస్తోంది.

కంపల్సరీ కావడంతో..
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 50 ఫేక్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లు, 10 ఫేక్ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ జోన్ డీసీపీ చక్రవర్తి తెలిపారు.

అలా తీస్తున్నారు..
ఆసీఫ్ నగర్‌లో తారీఫ్‌కు సొంత ఇమేజ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. ట్రావెల్ చేయడానికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వ్యాక్సిన్ సర్టిఫికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వారితో టై అప్ చేసుకోని ముఠా ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని తెలిపారు. వీరి నుంచి మొత్తం 65 రిపోర్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు.

వేరియంట్ల వర్రీ
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.

తప్పని ఆంక్షలు
కేసులు పెరగడంతో పొరుగు రాష్ట్రాలు ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. తమిళనాడు, కేరళ ఆదివారం పూర్తిగా లాక్ డౌన్ విధిస్తాయని ప్రకటించాయి. ఇటు ఢిల్లీ మాత్రం కేసులు తగ్గుతున్నాయి.. వీకెండ్ కర్ప్యూను ఎత్తివేస్తామని ప్రకటించాయి. టాప్ సైంటిస్ట్ మాత్రం ఒమిక్రాన్‌తో వైరస్ అంతం అవుతుందనే సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇదీ మానవాళికి కాస్త సానుకూలం అంశమే అయ్యింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications