జీడిమెట్లలో ఫైర్ యాక్సిడెంట్.. పేలిన 5 రియాక్టర్లు, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్‌లో గల జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలో గల శ్రీధర బయోటెక్ సంస్థలో రియాక్టర్లు పేలాయి. ఐదు రియాక్టర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే గల స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారట. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆపివేస్తున్నారు.

ప్రమాదంతో జీడిమెట్ల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలో ఇతర ఫార్మా, బయోటెక్ సంస్థలు ఉంటాయి. అక్కడికి మంటలు వ్యాపిస్తాయా అనే ఆందోళన నెలకొంది. శ్రీధర బయోటెక్ సంస్థలో జరిగిన ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications