సీఎం కేసీఆర్ సమీప బంధువులు కిడ్నాప్..? ఆ వివాదమే కారణమా..?

హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో కిడ్నాప్‌ కలకలం రేపింది. సీఎం కేసీఆర్ సమీప బంధువులు కిడ్నాప్‌నకు గురయ్యారు. మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు (51), సునీల్‌రావు (49), నవీన్‌రావు (47)ను దుండగులు మంగళవారం కిడ్నాప్‌ చేశారు. రాత్రి 7.30 సమయంలో ఐటీ అధికారులం అని లోపలికి వచ్చారు. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

former hockey player kidnap at hyderabad

తర్వాత ముగ్గురినీ అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు సమాచారం. సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ డీసీపీ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వచ్చారు. డైమండ్‌ పాయింట్, రాణిగంజ్‌ మీదుగా రెండు అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. హఫీజ్‌పేట భూ వివాదానికి సంబంధించే కిడ్నాప్‌ జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కవిత అక్కడకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రవీణ్ రావు కిడ్నాప్ కలకలం రేపింది. ఆయనను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారనే చర్చ జరుగుతుంది. తెలిసిన వారి పని అయి ఉంటుందని కొందరు.. భూ వివాదం అని మరికొందరు అంటున్నారు. కిడ్నాప్ కేసును త్వరలో చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+