హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆవుపేడతో వినాయక విగ్రహాలు.. పర్యావరణ పరిరక్షణకు గోసంరక్షణా చారిటబుల్ ట్రస్ట్ అడుగులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆగస్టు 31వ తేదీన దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే అన్ని చోట్ల వినాయక విగ్రహాలను విక్రయించే పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. వాడవాడలా కొలువుదీరే గణనాథులను పూజించడానికి, విభిన్న రూపాలలో ఉన్న గణనాథులను ఇప్పటి నుండే కొనుగోలు చేస్తున్నారు. అయితే గణేష్ చతుర్థి నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై కూడా దృష్టి ఉండాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు.

పర్యావరణానికి హాని కలగకుండా వినాయక విగ్రహాలు

పర్యావరణానికి హాని కలగకుండా వినాయక విగ్రహాలు

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులు, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడానికి వినియోగించాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రచారం చేస్తున్నారు. ఇక కొందరు పర్యావరణ పరిరక్షణ ను దృష్టిలో పెట్టుకొని, పర్యావరణానికి హాని కలగకుండా గణనాథులను తయారుచేసి విక్రయిస్తున్నారు. ప్రజలలో అవగాహన కల్గించటం కోసం మట్టితో తయారుచేసిన విగ్రహాలను ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున ఉచితంగా కూడా ఇస్తున్నారు.

గోసంరక్షణా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవుపేడతో గణనాధులు

గోసంరక్షణా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవుపేడతో గణనాధులు

ఆ కోవలోనే హైదరాబాద్ బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీ లోని శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ పర్యావరణానికి హాని కలగకుండా, ఆవు పేడతో వినాయక విగ్రహాలను తయారు చేసి లాభాపేక్ష లేకుండా విక్రయిస్తోంది. జీవజాతులకు హాని కలగకుండా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ఆవుపేడతో మూడు వందల రకాల ఉత్పత్తులను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది.

 ఆవుపేడతో మొత్తం 300 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్న ట్రస్ట్

ఆవుపేడతో మొత్తం 300 రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్న ట్రస్ట్

ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలు, గోడకు వేలాడదీసే బొమ్మలు, ఇంటి ముఖద్వారం తోరణాలు, శివలింగాలు, జ్ఞాపికలు, యోగి విగ్రహాలు, నర్సరీ కుండీలు, విత్తన గోలీలు, లక్ష్మీ దేవి విగ్రహాలు, ప్రమిదలు, జపమాలలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లు, పెన్నుల స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్లు, విభూతి, దంత మంజరి వంటి వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని చెబుతున్నారు. అలాగే గోమూత్రంతో ఫినాయిల్ , వేప, హ్యాండ్ వాచ్ ఉత్పత్తులు తయారు చేస్తున్నామని చెబుతున్నారు. భవిష్యత్తులో ఆవుపేడతో చెప్పులు కూడా తయారు చేస్తామని, ఆసనాలు వేసుకోవడం కోసం పీటలు, అగరవత్తులు, దోమల కోసం మచ్చర్ బత్తీల వంటి ఉత్పత్తులను కూడా తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెబుతున్నారు.

 ఆవుపేడతో తయారైన వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

ఆవుపేడతో తయారైన వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ


భావితరాలకు గోజాతిని వారసత్వ సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతున్న వారు, గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ కు విరాళాలు అందిస్తున్న దాతలకు ఆవు పేడతో తయారు చేసే వివిధ ఉత్పత్తుల ను ఉచితంగా అందజేస్తున్నామని ఉన్నారు. ఏది ఏమైనా ఈ వినాయక చవితి సందర్భంగానైనా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేలా ఆవుపేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి, పర్యావరణ గణపతిని పూజించాలి అని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
The Cow Protection Charitable Trust in Boduppal is taking steps to protect the environment by making Ganesh idols out of cow dung and selling them on a non-profit basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X