రేవంత్ రెడ్డికి నరేంద్రమోడీ గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అభివృద్ది చేస్తోన్న విషయం తెలిసిందే. అత్యాధునిక సౌకర్యాల కల్పనతో ప్రయాణికులకు మధురమైన అనుభూతులను పంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం ఈ పథకం కింద హైదరాబాద్ నగరంలోని కొన్ని రైల్వేస్టేషన్ల రూపురేఖలు మారిపోనున్నాయి. మలక్‌పేట్, ఉప్పుగూడ, మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్, హైదరాబాద్ రైల్వేస్టేషన్లలో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో బేగంపేట రైల్వేస్టేషన్ కూడా చేరింది.
బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.26.55 కోట్లు కేటాయించారు. ప్రతిరోజు 16,648మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీన్ని విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు రూ.309 కోట్లు కేటాయింగా, ఎంఎంటీఎస్ స్టేషన్లకు రూ.144.06 కోట్లు కేటాయించారు. అమృత్ భారత్ కింద ఈ స్టేషన్లలో అత్యాధునిక మరుగుదొడ్లు, 12 మీటర్ల వెడల్పు ర్యాంపుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్ మొత్తానికి షెడ్డు వేయడం, స్టేషన్ బయట పచ్చదనం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధికి ప్లాంటు ఏర్పాటు చేయడంలాంటి పనులు జరుగుతున్నాయి.

దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఎంఎంటీఎస్ స్టేషన్లలో ఆగేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ల పొడవు పెంచారు. వాటికి మరిన్ని హంగులు జోడించనున్నారు. 24 బోగీల రైలు ఆగే ప్లాట్‌ఫామ్ మొత్తం పైకప్పు వస్తుంది. ఎంఎంటీఎస్ స్టేషన్లకు రెండువైపుల నుంచి ప్రధాన రోడ్లకు చేరుకునేలా 6 మీటర్ల వెడల్పుతో కొత్త వంతెనలు, లిఫ్టులు వస్తున్నాయి. ప్రయాణికుల విశ్రాంతి గదులు, డిజిటల్ సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications