గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలారు: వాచ్‌మెన్, అలర్టయిన దక్కని ప్రాణం. మంత్రి హరీశ్ సంతాపం
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణం కలచివేస్తోంది. ఇంతకీ ఆయన ఎలా చనిపోయారు. హఠాతుగా గుండెపోటు ఎలా వచ్చిందనే అంశాలను వాచ్ మెన్ తెలియజేశారు. ఉదయం 7 గంటల సమయంలో జిమ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమయ్యాడని తెలిపారు. గుండెలో నొప్పి వస్తోందని సోఫాలోనే కూర్చున్నారట. వెంటనే కుటుంబ సభ్యులను, గన్‌మెన్లను అప్రమత్తం చేశాం అని వివరించారు. ఛాతీపై బలంగా ఒత్తినప్పటికీ ఆయనలో చలనం లేదన్నారు. వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించామని వాచ్‌మెన్ వివరించాడు.

వెంటనే ఆస్పత్రికి.. అయినా..
ఉదయం 7:45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చామని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. అప్పటికే ఆయన స్పందించలేని స్థితిలో ఉన్నారట. ఆస్పత్రికి తీసుకొచ్చే సయమానికి గౌతమ్ రెడ్డి శ్వాస కూడా తీసుకోవడం లేదట. కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 9:16 గంటలకు చనిపోయారని అపోలో వైద్యులు ప్రకటించారు.

హరీశ్ సంతాపం
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. సన్నిహితుడు మేకపాటి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి.. మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకుడన్నారు. నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసేవారని తెలిపారు. చిన్న వయసులో చనిపోవడం బాధాకరం అని హరీశ్‌రావు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Recommended Video

జగన్‌కు సన్నిహితుడు
మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కుమారుడే గౌతమ్ రెడ్డి.. సౌమ్యులు, విద్యావేత్త, అందుకే కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను సీఎం జగన్ అప్పగించారు. తనకు అప్పగించిన శాఖను సమర్ధవంతంగా ఆయన నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపేవారు. ఎప్పుడూ బిజీగా ఉండేవారు. వాస్తవానికి ఇవాళ ఉదయమే ఆయన దుబాయ్ నుంచి వచ్చారు. రేపు సీఎం జగన్‌తో సమావేశమై.. చర్చించాల్సి ఉండగా మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఆయన మృతితో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. రోదనలతో మిన్నంటాయి.












Click it and Unblock the Notifications