తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు... స్పందించిన వైద్య శాఖామంత్రి ఈటెల రాజేందర్

నిన్నా మొన్నటి దాకా చైనాను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలను వణికిస్తుంది. ఇక తాజాగా అందులో ఇండియా కూడా చేరింది. భారతదేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించటం ప్రజలను భయామ్దోలనకు గురి చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా వైరస్ కేసు నమోదు అయ్యిందని చెప్పటంతో తెలంగాణా ప్రజలు భయపడుతున్నారు. ఇక దీనిపై తెలంగాణా వైద్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణలో తొలి కరోనా కేసు.. నిర్ధారించిన మంత్రి ఈటెల

తెలంగాణలో తొలి కరోనా కేసు.. నిర్ధారించిన మంత్రి ఈటెల

తెలంగాణలో కరోనా వైరస్ కలకలంపై మంత్రి ఈటల రాజేందర్ నేడు మాట్లాడారు . బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న అతను దుబాయ్‌ వెళ్లాడని హాంకాంగ్‌కు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేశాడని పేర్కొన్నారు. ఇక తర్వాత బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడన్నారు. తరువాత జ్వరం రావటంతో నిన్న గాంధీ ఆస్పత్రికి వచ్చాడని, యువకుడి శాంపిల్స్‌ను పూణే కు పంపామన్నారు.

 భారత దేశ వాతావరణంలో కరోనా వైరస్ ప్రభావం చూపదన్న మంత్రి

భారత దేశ వాతావరణంలో కరోనా వైరస్ ప్రభావం చూపదన్న మంత్రి


కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని మంత్రి తెలిపారు.అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇక వైద్య శాఖాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత దేశ వాతావరణంలో కరోనా వైరస్ ప్రభావం చూపించలేదని మంత్రి ఈటెల అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై తామే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క కేసు మినహాయించి ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ ఒక్కటి కూడా రాలేదని ఈటెల స్పష్టం చేశారు.

 తెలంగాణలో హై అలర్ట్ .. హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు

తెలంగాణలో హై అలర్ట్ .. హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు

మన రాష్ట్రంలోని శీతోష్ణస్థితికి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేదని చెప్పిన మంత్రి ప్రభుత్వం నివారణా చర్యలు చేపడుతుందని చెప్పారు. హై అలెర్ట్ ప్రకటించారు . ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు. ఇంకా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు . బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్‌లు పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మూడు ఆస్పత్రుల్లో కరోనా ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని చెప్పిన మంత్రి 14 రోజుల పాటు ఆ వ్యక్తిని వైద్యులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+