హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విటమిన్- డీ లోపమే శాపమా..? నిమ్స్, గాంధీ వైద్యుల పరిశోధనలో ఆసక్తికర అంశాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ గురించి పరిశోధనలు, దానిని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. నివారణ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని సజెస్ట్ చేస్తున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలని కోరుతున్నారు.

విటమిన్ డీ లోపం ఉంటే..

విటమిన్ డీ లోపం ఉంటే..

విటమిన్ డీకి సంబంధించిన కొన్ని విషయాలను నిపుణులు వెల్లడించారు. విటమిన్ డీ లోపం ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ అని చెప్పుకొచ్చారు. దీనిపై ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్‌లో విటమిన్ డీ జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు. గాంధీ, నిమ్స్ వైద్యులు చేపట్టిన అధ్యయన నివేదికను నేచర్.కామ్ జర్నల్ లో ప్రచురితమైంది.

ట్యాబ్లెట్లు తీసుకోవాలి..

ట్యాబ్లెట్లు తీసుకోవాలి..

కోవిడ్ సోకిన వారికి రోజువారీ అందించే వైద్యంలో అధిక మోతాదులో నోటి ద్వారా విటమిన్ డి అందిస్తే ప్రభావం గణనీయంగా ఉంటుందంని తెలిపారు. విటమిన్-డి పొందిన రోగుల్లో అన్ని ఇన్ ప్లేమేటరీ మార్కర్స్ లో గణనీయమైన తగ్గుదుల ఉందని గుర్తించారు. కరోనా రోగుల్లో మరణాల ముప్పుని కూడా గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది. విటమిన్ డి 80 నుంచి 100 ఎన్ జి/ఎల్ ను అందించడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా వైరస్‌ను గణనీయంగా తగ్గించినట్లు చెబుతున్నారు. మెరుగైన ఫలితాల కోసం విటమిన్ డి థెరపీని కరోనా ప్రస్తుత చికిత్స ప్రొటోకాల్ లో చేర్చవచ్చని వెల్లడించారు.

90 శాతం మందికి లోపం

90 శాతం మందికి లోపం

దేశంలో 90 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. వారి శరీరాల్లో సగటున 13 నుంచి 15 ఎన్జీ విటమిన్ మాత్రమే ఉంది. ఇది శరీరానికి సరిపోదని, ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో విటమిన్ డి తో పాటు సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డి పెంచుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యరశ్మి ద్వారా సరిపడ విటమిన్ డి అందుతుందని అంటున్నారు.

Recommended Video

Yellow Fungus Cases Reported In UP | Oneindia Telugu
55 ఎన్జీ కంటే తక్కువ

55 ఎన్జీ కంటే తక్కువ


విటమిన్ డి లెవెల్ 55 ఎన్జీ కంటే ఎక్కువ ఉన్నవారిలో 5 శాతం కంటే తక్కువమందికి కొవిడ్ సోకుతుందని అంటున్నారు. 60 ఎన్జీ ఉన్నవారిలో మరణాల శాతం సున్నాగా ఉందంని తెలిపారు. 30 ఎన్జీ కంటే తక్కువ విటమిన్ డి ఉంటే మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు.

English summary
high vitamin-d levels reduce covid infection nims study revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X