హైదరాబాద్‌లో ‘కొత్త సంవత్సర వేడుకలు’ ఆంక్షలు: ఫ్లైవర్లన్నీ బంద్, రేపట్నుంచే
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంలో ఇప్పటికే అనేక పండగలను జరుపుకోనివ్వని ఈ కరోనా మహమ్మారి.. ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలను కూడా రద్దు చేసేసింది. దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కొత్త సంవత్సర వేడుకలపై నిషేధానని విధించాయి.

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
తాజాగా, హైదరాబాద్ నగరంలోనూ కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.

ఫైవర్లు బంద్..
నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. తాజా ఆంక్షల నేపథ్యంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫైఓవర్లు గురువారం రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు అమలవుతాయని వెల్లడించారు.

డిసెంబర్ 31-జవనరి 1 వరకు ఆంక్షలు
గురువారం ఉదయం 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం స్పష్టం చేసింది. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలను పోలీసు అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications