• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నాడు వైయస్సార్..నేడు కేసీఆర్: అన్నింటికీ..బుల్లెట్ లాంటి సమాధానం: ఏం జరిగిదంటే...!

|

సమాజం గెలిచింది. దిశ ఆత్మ శాంతించింది. దిశ ఘటన తరువాత యావత్ జాతి ఒక్కటిగా నిలిచింది .ఆ నలుగురికి ఉరే సరి అంటూ నినదించింది. పార్లమెంట్ ఈ ఘటనతో హోరెత్తింది. దిశ ఘటన నలుదిశలా ఆవేశం రగిల్చింది. ప్రజల ఒత్తిడికి ఎవరైనా లొంగాల్సిందే నాడు వైయస్సార్..సజ్జనార్‌లు హీరోలుగా నిలువగా నేడు కేసీఆర్ సజ్జనార్‌లు హీరోలయ్యారు. మొత్తానికి రెండు ఎపిసోడ్‌లకు బుల్లెట్ ‌లాంటి సమాధానం ఇచ్చారు వీసీ సజ్జనార్.

కనిపించే మూడు సింహాలు వీసీ సజ్జనార్.. కనిపించని ఆ నాలుగో సింహం ఎవరు..? ఎన్‌కౌంటర్ వెనక..

ఒక్క బులెట్‌తో సమాధానం

ఒక్క బులెట్‌తో సమాధానం

అవును దిశా ఆత్మకు శాంతి చేకూరింది. దిశా కుటుంబానికి న్యాయం జరిగింది. దిశపై అత్యంత పాశవికంగా విరుచుకుపడ్డ మృగాళ్లు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సీన్‌ రీకన్స్‌ట్రక్షన్ చేస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశారు నిందితులు. వెంటనే పోలీసులు తమ తుపాకులకు పనిచెప్పారు. అంతే ప్రజలకు కావాల్సిన సమాధానం దొరికింది. ఈ ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘాలు, చట్టాలు ఎలా రియాక్ట్ అయిన సగటు మానవీయత ఉన్న ప్రతి మనిషీ ఆశించింది ఇదే.

  Disha Issue : బ్రేకింగ్ : నిందితుల ఎన్ కౌంటర్... EXCLUSIVE ఎన్ కౌంటర్ వీడియో
   ప్రభుత్వం పోలీసులపై ప్రజలు ఆగ్రహం

  ప్రభుత్వం పోలీసులపై ప్రజలు ఆగ్రహం

  ఇక దిశా అత్యాచారం, హత్య జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ నిందితులను జైల్లో పెట్టి పోలీసులు సపరమర్యాదలు చేయడాన్ని జీర్ణించుకోలేని సామాన్యులు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది.. పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అవమానకరంగా వ్యవహరించారని తెలంగాణ ప్రభుత్వం ఏంచేస్తోందని ప్రజలు ప్రశ్నించారు. పోలీసులు సరిగ్గా స్పందించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. హోంమంత్రి మహమూద్ అలీ, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలపైన ప్రజలు మహిళలు మండిపడ్డారు. అయితే ప్రజల చేతుల్లోకి నిందితులు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. ఏ కేసులో ఎలా చేయాలో అదే చేశారు. నింబంధనలను పోలీసులు ఉల్లంఘించలేదు.

  కేసీఆర్‌ను టార్గెట్ చేసిన జాతీయ మీడియా

  కేసీఆర్‌ను టార్గెట్ చేసిన జాతీయ మీడియా

  దిశా ఘటనలోని నిందితులకు జైల్లో మటన్ భోజనం పెట్టడంపై ఆగ్రహం పెల్లుబికింది. జాతీయ మీడియా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎక్కడా అంటూ ప్రశ్నించింది. అంతేకాదు కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు వెళ్లిన సమయంలో బాధితురాలి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ విమానాశ్రయంలోనే జాతీయ మీడియా కేసీఆర్‌ను ప్రశ్నించింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  సజ్జనార్ పేరు వినగానే తడిసిన నిందితుల లాగులు

  సజ్జనార్ పేరు వినగానే తడిసిన నిందితుల లాగులు

  ఇక ఇదే సమయంలో నిర్భయ ఘటనపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికీ నిందితులను ఉరితీయలేదు. ప్రభుత్వాలు ఇలానే ఉంటే ఆడపిల్లలకు భద్రత ఎక్కడుంది అంటూ ప్రశ్నలు తలెత్తాయి. కానీ జరుగుతున్నది ఏమిటో.. జరగబోయేది ఏంటో ఆ నలుగురు నిందితులకు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. సజ్జనార్ పేరును తలచుకున్నప్పుడు లేదా చూసినప్పుడు వారి లాగులు తడిచిపోయాయి. తిన్న మటన్ ముక్కలు గొంతులోకి వచ్చి ఉంటాయి. అంతే సరిగ్గా పదిరోజుల్లో ఎలా జరగాలో అలా జరిగిపోయింది. దిశ ఆత్మ శాంతించింది.

  100 మిలియన్ ప్రశ్నలకు ఒక్క బుల్లెట్ సమాధానం

  100 మిలియన్ ప్రశ్నలకు ఒక్క బుల్లెట్ సమాధానం

  దేశం మొత్తం ఈ రోజు ఇదే చర్చ. నాడు తెలంగాణ ప్రభుత్వంను ఆడిపోసుకున్న గొంతులు నేడు పొగడుతున్నాయి. ప్రత్యేకంగా పోలీసులను సజ్జనార్‌ను అభినందిస్తున్నారు. నిందితుల ఎన్‌కౌంటర్ ఏ ప్రభుత్వానిదో.. ఏ అధికారిదో కాదు... ఈ నిర్ణయం యావత్ దేశం కోరుకున్న నిర్ణయం. ప్రజల ఆగ్రహానికి సమాధానం దొరికింది. ఇకపై ఎవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేసింది ఈ ఎన్‌కౌంటర్. ఎవరైనా అత్యాచారం చేయలన్న ఆలోచన చేసినా ఏం జరుగుతుందో కళ్లకు కనిపించేలా చేశారు తెలంగాణ పోలీసులు. మొత్తానికి దేశం సంధించిన 100 మిలియన్ ప్రశ్నలకు ఒక్క బుల్లెట్ సమాధానం ఇచ్చింది.

  English summary
  The encounter of Disha murder case accused gave an answer to the million questions. The accused who tried to escape from the scene were encountered by Telangana police in the early hours of Friday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X