నెలకు ఎంత సంపాదిస్తున్నానో చెప్పిన కుమారి ఆంటీ
కుమారి ఆంటీ... ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఆమె చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతున్నారు. అయితే రుచి అమోఘంగా ఉండటంతో భోజన సమయానికి ఎక్కడెక్కడి నుంచో అందరూ అక్కడికే వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి విరుగుడుగా పోలీసులు ఆమె స్టాల్ ను తొలగించారు. అలా చేయడంవల్ల తనలాంటివారి ఉపాధికి గండి పడుతంటూ ఆమె చెందిన ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఈ విషయం చేరడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఆమె స్టాల్ ను అక్కడే వెంటనే తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమయం చూసుకొని తాను కూడా అక్కడ భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. తమ షోలో పాల్గొనాలంటూ వివిధ టీవీ చానల్స్ నుంచి కుమారి ఆంటీకి ఆహ్వానాలు కూడా అందాయి. మీది వెయ్యి రూపాయలైంది.. రెండు లివర్స్ ఎక్స్ ట్రా అన్న డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. దీనిపై ఎంతోమంది రీల్స్ కూడా చేస్తారు.

ఎన్నో రకాల నాన్ వెజ్ పదార్థాలను తక్కువ ధరలకే ఆమె అమ్ముతున్నారు. ఆహారం బాగుండటంతోపాటు తక్కువ ధరకే అమ్ముతుండటంతో ఎంతోమంది ఆ స్టాల్ కు వచ్చేస్తున్నారు. తన నెల సంపాదన గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. తనదగ్గరకు వచ్చే ప్రతి యూట్యూట్ చానల్ వారికి ఆమె సమాధానం చెబుతూనే ఉన్నారు.
ప్రతిరోజు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారుచేసి అమ్మడంవల్ల ఖర్చులు పోను నెలకు లక్షన్నర రూపాయలు మిగులుతాయని చెప్పింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. తన సంపాదన ముందు స్టాఫ్ వేర్ ఉద్యోగులు కూడా తక్కువే అనే కామెంట్లు వస్తున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటలలోపు తన వ్యాపారం కొనసాగుతుందని, ఆ తర్వాత మూసేస్తానని చెప్పింది. గంటన్నర వ్యవధిలోనే భారీ సంపాదిస్తున్నారనే చెప్పాలి.
-
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ???












Click it and Unblock the Notifications