Hyderabad: ఆ హోటళ్లు, రెస్టారెంట్లలో తింటే.. డైరెక్ట్ గా అక్కడికే..!

హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక.. బయట రెస్టారెంట్లు, హోటళ్లలో తింటున్నారా.. అయితే మీరు అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక రోడ్ సైడ్ గురించి చెప్పనక్కర్లేదు. కాదా హైదరాబాద్ లోని రెస్టారెంట్ల, హోటళ్లలోని పరిస్థితులపై ఆందోళన నెలకొన్న వేళ.. నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా రంగంలోకి దిగారు. బుధవారం రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్‌లోని మొఘల్‌ రెస్టారెంట్‌, మాసబ్‌ ట్యాంక్‌లోని దిన్‌ హిల్‌ హోటల్‌లో దారుణ పరిస్థితులు గుర్తించారు.

వంటగదిలో పరిస్థితులపై రెస్టారెంట్, హోటల్ యజమానులకు విజయలక్ష్మి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరిశుభ్రత ప్రమాణాలను పాటించడంలో విఫలమైన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార అందించడం హోటళ్లు, రెస్టారెంట్ల బాధ్యత అన్నారు.హైదరాబాద్‌లోని రెస్టారెంట్లలో అందించే ఆహారం భద్రత, పరిశుభ్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడానికి రెగ్యులర్ తనిఖీలు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Hyderabad Mayor Vijayalakshmi inspected many restaurants

నగరంలోని అన్ని రకాల ఆహార కేంద్రాల్లో తరచూ తనిఖీలు చేయాలని విజయలక్ష్మి ఆదేశించారు. సరైన ఆహారం అందించని, ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా నిర్వహించే ఏవైనా హోటళ్లు లేదా రెస్టారెంట్‌లు వెంటనే మూసివేయడంతో పాటు జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టీమ్‌లు తనిఖీలు చేస్తున్నప్పటికీ హైదరాబాద్‌లోని కొన్ని రెస్టారెంట్లలో పరిస్థితులు మారడం లేదు. రెస్టారెంట్లను జవాబుదారీగా ఉంచడం ద్వారా, హైదరాబాద్ అంతటా భోజన పరిస్థితులను మెరుగుపరచడానికి తాము కట్టుబడి ఉన్నామని మేయర్ హామీ ఇచ్చారు.

హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రేటింగ్ ఇవ్వాలని భావిస్తున్నారు. రేటింగ్ జాబితాను ఆన్ లైన్ లో ఉంచాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు హెటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి తెలుస్తుందని చెబుతున్నారు. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా తక్కువగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+