సిటీలో భారీ సెక్స్ రాకెట్, లాడ్జిలోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం, సెక్స్ వర్కర్లు అరెస్ట్..

హైటెక్ సెక్స్ రాకెట్‌ గుట్టును హైదరాబాద్ పోలీసులు సోమవారం రాత్రి రట్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోన్న వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. సుల్తాన్ బజార్‌లో లాడ్జినే వ్యభిచార కూపంగా మార్చేశారు. లాడ్జిలోకి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచార దందా నడుపిస్తున్నారు. దీనిపై సమాచారం రావడంతో లాడ్జీలో రైడ్ చేయగా.. భారీ సెక్స్ రాకెట్ బయటపడింది.

 hyderabad police busted sex racket in sultan bazar lodge

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పారిధిలో గల లాడ్జిలో యాజమాన్యం వ్యభిచార దందా సాగిస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం రావడంతో లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. వ్యభిచార దందా సాగిస్తున్న లాడ్జి యాజమాని, సెక్స్ వర్కర్లు, విటులను పట్టుకున్నారు. వారినీ సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్‌‌కు తరలించారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగుతున్నట్లు తెలుస్తోంది.

కోటికి కూతవేటు దూరంలో.. భాగ్యనగర నడిబొడ్డున లాడ్జీలో సెక్స్ రాకెట్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ, తనిఖీలు చేపడుతూనే ఉంటారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగడం పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీనికి సమాధానం పోలీసుల విచారణలో తెలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+