Cyber Crime: సైబర్ క్రైమ్ కు సంబంధించి రూ.21 లక్షలు రికవరీ చేసిన పోలీసులు..
దేశంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతోన్నాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో ఎక్కువగా చదువుకున్న వారే మోసపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇన్ స్టాగ్రామ్ చూస్తుండగా.. పార్ట్ టైమ్ జాబ్ గురించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రిప్లే ఇచ్చింది. అవతలి వ్యక్తి పార్ట్ జాబ్ ఉందని.. కేవలం యూట్యూబ్ వీడియోలకు లైక్ చేస్తే చాలు అని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకుంది. దీంతో అతను యూట్యూబ్ లింక్స్ పంపాడు.
ఆమె యూట్యూబ్ వీడియోలకు లైక్ లు కొట్టింది. దీంతో ఆమె అకౌంట్ల డబ్బులు వేశారు. ఇదేదో బాగుందని అనుకున్న ఆమె యూట్యూబ్ వీడియోలకు తెగ లైక్ లు కొట్టింది. ఆ తర్వాత అవతలి వ్యక్త తమ వద్ద పెట్టుబడి పెడితే డబుల్ ఆదాయం వస్తుందని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె దశల వారీగా పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఇలాగే కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. కేసు నమోదు అయిందని.. అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారని చెప్పాడు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని.. విచారణ పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాడు.

దీంతో బాధితుడు దఫా దఫాలుగా రూ.9 లక్షల వరకు పంపాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు. అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పలు సందర్భాల్లో డబ్బు రికవరీ చేశారు. తాజా రెండు సైబర్ కేసులకు సంబంధించి హైదరాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం రూ.21,55,331 తిరిగి వచ్చేలా చేసింది. పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టి లాభాలు వస్తాయనే సాకుతో బాధితులను మోసం చేసిన కేసులో డబ్బు రికవరీ చేశారు.
రెండవ కేసు విషయానికొస్తే.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులుగా చెప్పుకుని మోసగాళ్ల 67 ఏళ్ల వ్యక్తికి నుంచి రూ.8 లక్షలు వసూలు చేశారు. దీనికి సంబంధించి డబ్బులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications