హైదరాబాద్‌లో ఉగ్రవాద శిబిరమా? కిషన్‌రెడ్డి చెప్పిందే నిజమైందా? డీజేఎస్ క్యాంప్ సీజ్!
హైదరాబాద్: జంటనగరాల్లో ఇప్పటికీ ఉగ్రవాద మూలాలు ఉన్నాయని, తీవ్రవాద సానుభూతిపరులు తలదాచుకున్నారంటూ కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరింపజేసుకున్న దర్ష్‌గా-ఇ-జిహాద్-ఒ-షహదత్ (డీజేఎస్)కు చెందిన శిక్షణా శిబిరాలు దీనికి నిదర్శనంగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోన్న కారణంగా ప్రస్తుతం డీజేఎస్ సంస్థ దేశవ్యాప్తంగా నిషేధాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ.. గుట్టు చప్పుడు కాకుండా కొంతమంది యువకులను ఉగ్రవాద కార్యకలాపాల దిశగా మొగ్గు చూపేలా శిక్షణ ఇస్తోందని అంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు.

స్వీయరక్షణ పేరుతో..
మార్షల్ ఆర్ట్స్, స్వీయ రక్షణ, కర్రసాము, కరాటే పేరుతో డీజేఎస్ సంస్థ ప్రతినిధులు కొంతకాలంగా పాతబస్తీకి చెందిన కొంతమంది ఎంపిక చేసిన యువకులకు శిక్షణ ఇస్తున్నారు. సైదాబాద్ అక్బర్‌బాగ్‌లోని హజ్రత్ ఉజలె-షా ఈద్గా గ్రౌండ్స్‌లో ఈ శిక్షణ కొనసాగుతోంది. నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఏ సంస్థ అయినా సరే! ఎలాంటి కార్యకలాపాలనూ చేపట్టకూడదని చట్టం చెబుతోంది. ప్రజలు, ప్రత్యేకించి- యువతను భాగస్వామ్యం చేసే విధంగా తన కార్యక్రమాలను కొనసాగించడం చట్ట విరుద్ధం. కొంతకాలంగా- డీజేఎస్ సంస్థ పాతబస్తీకి చెందిన సుమారు వెయ్యిమంది యువకులకు స్వీయరక్షణ పేరుతో శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఆత్మ రక్షణ కోసమే తాము ఈ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని డీజేఎస్ ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ.. ఉగ్రవాద శిక్షణ ఇస్తూ డీజేఎస్ సంస్థ తమ కార్యకలాపాలను యదేచ్చగా కొనసాగిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

11వ తేదీ నుంచీ కొనసాగుతున్న శిక్షణ
ఈ నెల 11వ తేదీ నుంచి హజ్రత్ ఉజలె-షా ఈద్గా గ్రౌండ్స్‌లో ఈ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టారు కిషన్ రెడ్డి. హైదరాబాద్‌లో ఉగ్రమూలాలు ఇంకా ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని కొద్దిరోజుల కిందటే వెల్లడించారు. దీనికి అనుగుణంగా- హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ శిబిరాలపై దాడులు నిర్వహించారు. దర్గా మైదానం తలుపులను మూసివేశారు. శిక్షణా శిబిరాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఆ సమయంలో సుమారు వందమంది వరకు యువకులు స్వీయ రక్షణ కార్యక్రమాల్లో శిక్షణ పొందుతున్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా పోలీసులు రావడం- ఈ శిక్షణా శిబిరాన్ని వెంటనే మూసి వేయాలంటూ ఆదేశించడం, డీజేఎస్ ప్రతినిధులు దీన్ని అడ్డుకోవడంతో అక్బర్‌బాగ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులతో వాగ్వివాదం..
శిక్షణ శిబిరాలను మూసివేయించడానికి వచ్చిన సైదాబాద్ పోలీసులతో సంస్థ ప్రతినిధులు వాగ్వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే వహదత్-ఇ-ఇస్లామి అధ్యక్షుడు మౌలానా నసీరుద్దీన్ పోలీసులను సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. పోలీసులను కాదని ఆయన ఈద్గా గ్రౌండ్స్ తలుపులను తెరిచి, లోనికి ప్రవేశించారు. ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో- శిక్షణలో ఉన్న యువకులు గుమికూడటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. అనంతరం పోలీసులు వారిని శాంతింపజేశారు. డీజేఎస్‌పై ఉన్న నిషేధం విషయాన్ని గుర్తు చేశారు. డీజేఎస్ సంస్థ ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకూడదంటూ నిషేధాజ్ఞలు ఉన్నాయని మౌలానా నసీరుద్దీన్‌కు వివరించారు. సుమారు గంట సమయం అనంతరం పరిస్థితులు శాంతించాయి.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications